Viral: వరుడికి షాక్..! పెళ్లి పీటలపై నుంచి వెళ్లిపోయిన వధువు.. రెచ్చిపోయిన ఫ్యామిలీ.
పెళ్లి పీటలపై వరుడికి షాక్ ఇచ్చి...వెళ్లిపోయింది వధువు. తాళి కట్టేవేళ ఈ పెళ్లి వద్దు.. వద్దు.. వద్దు అంటూ కన్నీరుపెట్టి మరీ వేడుకుంది. కానీ.. పెళ్లి కొడుకు సహా బంధువులు ఎవరూ ఆమె మాట వినలేదు.. అందరూ కలిసి బలవంతంగా తాళి కట్టించబోయారు. పెళ్లి పీటలమీదే వాగ్వాదం.. బయట బంధువుల రణరంగం.. చివరికెలాగో పెళ్లైతే ఆగింది. ఈ ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లా తిరువాడనైలో జరిగింది.
పెళ్లి పీటలపై వరుడికి షాక్ ఇచ్చి.. వెళ్లిపోయింది వధువు. తాళి కట్టేవేళ ఈ పెళ్లి వద్దు.. వద్దు.. వద్దు అంటూ కన్నీరుపెట్టి మరీ వేడుకుంది. కానీ.. పెళ్లి కొడుకు సహా బంధువులు ఎవరూ ఆమె మాట వినలేదు.. అందరూ కలిసి బలవంతంగా తాళి కట్టించబోయారు. పెళ్లి పీటలమీదే వాగ్వాదం.. బయట బంధువుల రణరంగం.. చివరికెలాగో పెళ్లైతే ఆగింది. ఈ ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లా తిరువాడనైలో జరిగింది. బలవంతపు పెళ్లి వద్దన్న అమ్మాయి పెళ్లికి నిరాకరించింది. అమ్మాయి ఆఖరు నిమిషంలో పెళ్లి వద్దనే సరికి వరుడు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పెళ్లికూతురు కుటుంబసభ్యులపై దాడి చేశారు. అలాగే తమకు అవమానం జరిగిందంటూ పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. ఈ పెళ్లి 4 నెలల కిందేట ఫిక్సయ్యింది. ఐతే.. అమ్మాయి తనకు పెళ్లి ఇష్టం లేదనే విషయాన్ని ముందే చెప్పిందో లేదో క్లారిటీ లేదు కానీ.. పీటల వరకూ వచ్చాక తాళి వద్దనే సరికి.. అబ్బాయి వాళ్లు రెచ్చిపోయారు. ఇరువర్గాల మధ్య తిట్లు, దాడులతో ఒక్కసారి ఉద్రిక్తత తలెత్తింది. ముహూర్తానికి తాళి కట్టించేయలనే తొందరే తప్ప.. కనీసం ఆమెను ఓదారుద్దాం.. ఏం జరిగిందో తెలుసుకుందా అని ట్రై చేయలేదు. తల్లిదండ్రులు సహా అంతా ఏదో రకంగా తాళి కట్టించేలానే చూడడంతో విధిలేని పరిస్థితుల్లో అమ్మాయి ప్రతిఘటించి తాళిమెడలో పడకుండా అడ్డుకుంది.
——————
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...