Srisailam: శ్రీశైలం నడకదారిలో పెద్దపులి ప్రత్యక్షం.. అంతా మల్లన్న మాయ అంటూ

Updated on: Feb 12, 2026 | 12:48 PM

శివరాత్రి సమీపిస్తుండగా శ్రీశైలం పాదయాత్రలో భక్తులకు అద్భుత అనుభవం ఎదురైంది. నడకదారిలో పెద్దపులి ప్రత్యక్షమైంది. భయం భయంగా చూస్తుండగానే, పులి మాయమైంది. మల్లన్నే తమను కాపాడాడని, అందుకే ప్రమాదం తప్పిందని భక్తులు విశ్వసిస్తున్నారు. "ఓం నమః శివాయ" నామస్మరణతో యాత్రను కొనసాగించారు. ఇది భక్తులలో భక్తి భావాన్ని పెంచింది.

శివరాత్రి సమీపిస్తుండటంతో శ్రీశైల యాత్రకు క్యూకడుతున్నారు మల్లన్న భక్తులు. ఓం నమః శివాయ అంటూ శివనామస్మరణతో కాలినడకన భక్తులు శివయ్య దర్శనానికి వెళ్తున్నారు. ఇంతలో నడకదారిలో పొదల్లో ఏదో చప్పుడు. భయం భయంగానే భక్తులు ఏమై ఉంటుందా అని పరిశీలించి చూశారు. ఇంకేముంది బెబ్బులి పొదల మధ్యలో ఠీవీగా కూర్చుని కనిపించింది. దానిని చూడగానే భక్తుల గుండె ఝల్లుమంది. భయం భయంగా అది ఎక్కడ తమపై దాడి చేస్తుందోనని అలా పులిని చూస్తున్నారు. పులి కూడా వీరిని గమనించింది. అనంతరం విచిత్రంగా పెద్దపులి అక్కడినుంచి మాయమైంది. హమ్మయ్య అనుకుంటూ పాదయాత్రగా శ్రీశైలం వెళుతున్న భక్తులు తిరిగి తమ నడక ప్రారంభించారు. మల్లన్నే తమను కాపాడాడని, అందుకే పెద్దపులి ఏం చేయకుండా వెళ్లిపోయిందంటూ భక్తజనం ఓం నమశి:వాయ అంటూ నినాదాలు చేసుకుంటూ ముందుకు కదిలారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sapota: బాగా పండిన సపోటాలు తింటే ఏమవుతుందో తెలుసా ?? ఈ వీడియో తప్పక చూడండి

Balakrishna: బాలయ్య దెబ్బ.. కుర్ర హీరోలు అందరూ అబ్బా..

Ram Charan: ఓ పక్క రూ.కోట్లు.. ఇంకో పక్క ఇచ్చిన మాట.. సందిగ్ధంలో చరణ్

Dhurandhar: ధురంధర్ ఎఫెక్ట్‌.. హీరోకు తీవ్రవాదుల ధమ్కీ

Ustaad Bhagat Singh: తెలంగాణలో పవన్‌ సినిమాకు.. టికెట్ రేట్స్‌ పరేషాన్

Loading...
Unable to load recommendations.
Follow Us