Sheikh Hasina: సోదరితో కలిసి షాపింగ్‌ చేసిన షేక్‌ హసీనా.! తీవ్ర షాక్‌లో బృందం..

|

Aug 10, 2024 | 5:00 PM

భారత్‌కు చేరుకున్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా బృందం తీవ్ర షాక్‌లో ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. హసీనాతో పాటు ఆమె సోదరి, పదుల సంఖ్యలో సహాయకులు భారత్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం వీరంతా ఘజియాబాద్‌లోని ఓ నివాసంలో సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ వారితో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్లు సమాచారం.

భారత్‌కు చేరుకున్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా బృందం తీవ్ర షాక్‌లో ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. హసీనాతో పాటు ఆమె సోదరి, పదుల సంఖ్యలో సహాయకులు భారత్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం వీరంతా ఘజియాబాద్‌లోని ఓ నివాసంలో సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ వారితో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్లు సమాచారం. భారత ప్రోటోకాల్ అధికారులు హసీనా జట్టు సభ్యులకు దుస్తులు ఇతర వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు సహాయం అందించారు. తాజాగా షేక్ హసీనా తన సోదరి రిహన్నాతో కలిసి ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ బేస్ షాపింగ్ కాంప్లెక్స్‌కు వచ్చి తనకు అవసరమైన దుస్తులు ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశారు. ఆమె సుమారు రూ.30 వేల విలువైన సామగ్రి కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మొత్తాన్ని ఆమె భారతీయ రూపాయిలలో చెల్లించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షేక్‌ హసీనా.. హిండన్ ఎయిర్‌బేస్‌లోని సేఫ్ హౌస్‌లో ఉంటున్నారు. ఆమె త్వరలో ఇక్కడ నుండి మరొక ప్రదేశానికి తరలివెళ్లవచ్చని తెలుస్తోంది.

బంగ్లాదేశ్‌లో వారు ఎదుర్కొన్న భయానక అనుభవాల నుంచి వారు ఇంకా కోలుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్ సైన్యం షేక్ హసీనాకు రాజీనామా చేసేందుకు 45 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చింది. దీంతో ఆమె వెంటనే తన రాజీనామాను అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్‌కు సమర్పించారు. ఆందోళనకారులు అధికారిక నివాసం దిశగా దూసుకొస్తుండటంతో ప్రధాని సహా ఆమె సహాయకులు దేశాన్ని వీడి వచ్చారు. సమయం మించిపోతుండటం వల్ల కనీసం దుస్తుల వంటి వ్యక్తిగత వస్తువులు సైతం తెచ్చుకునే పరిస్థితి లేకపోయిందని వారు అధికారుల ముందు వాపోయారు. ముందు ప్రాణాలతో బయటపడటం ముఖ్యమని భావించిన వారంతా ప్రధానితో కలిసి సీ-130 జే విమానంలో భారత్‌కు వచ్చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.