ఇంటి బేస్‌మెంట్‌ కింద రహస్య అర.. అందులో ఏముందో చూసిన పోలీసులకు షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

|

Mar 02, 2022 | 7:37 PM

ఆ పాప మిస్సై రెండేళ్లు అవుతుంది. ఎన్ని చోట్ల వెతికినా ఆచూకి లేదు. పోలీసులు సవాల్‌గా తీసుకుని ఈ కేసును సాల్వ్ చేశారు. ఒక ఇంట్లో మెట్ల కింద ఉన్న ఒక రహస్య అరలో ఆ చిన్నారిని కనుగొన్నారు.


ఆ పాప మిస్సై రెండేళ్లు అవుతుంది. ఎన్ని చోట్ల వెతికినా ఆచూకి లేదు. పోలీసులు సవాల్‌గా తీసుకుని ఈ కేసును సాల్వ్ చేశారు. ఒక ఇంట్లో మెట్ల కింద ఉన్న ఒక రహస్య అరలో ఆ చిన్నారిని కనుగొన్నారు. చిన్నారి ఆరోగ్యంగానే ఉండటంతో పాపను లీగల్ గార్డియన్‌కు అప్పగించారు. ఈ ఘటన న్యూయార్క్‌లో జరిగింది. పాప పేరు పైస్లీ షుల్టిస్. పాప కస్టడీని కోల్పోవడంతో ఆమె తల్లిదండ్రులే పాపను దాచిపెట్టారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఏం జరిగిందంటే.. ఇంటికి వెళ్లి తనిఖీ చేసినప్పుడు, పోలీసు అధికారి ఎరిక్‌కు.. బేస్‌మెంట్‌కు వెళ్లే చెక్క మెట్లపై అనుమానం కలిగింది. దీంతో ఆ ఆఫీసర్ టర్చ్ లైట్ వేసి చూడగా.. లోపల ఒక దుప్పటి కనిపించింది. దీంతో పోలీసులు ఆ చెక్క మెట్లను తొలగిస్తుండగా.. లోపల దృశ్యం చూసి కంగుతిన్నారు. ఎందుకంటే.. అక్కడ మిస్సైన పాపతో పాటు ఆమె తల్లి కూడా కనిపించారు. కాగా పిల్లలకు వారి తల్లిదండ్రుల నుంచి హాని ఉందని భావిస్తే అమెరికా లాంటి దేశాల్లో సదరు పిల్లల బాధ్యతను లీగల్ గార్డియన్‌కు అప్పగిస్తారు.

మరిన్ని చూడండి ఇక్కడ: