Flight Accident: రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి విమానం..అదుపు తప్పింది.. పైలెట్ ఏం చేశారంటే.. Viral Video

|

Apr 21, 2021 | 7:10 PM

అప్పుడెప్పుడో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తన దేశానికి ఎన్నో సేవలు అందించింది ఆ యుద్ద విమానం. దాన్ని మళ్ళీ అదే స్థాయిలో ప్రజలకు చూపించేందుకు ప్రయత్నించగా.. అదుపుతప్పి కూలిపోయింది.

Flight Accident: రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి విమానం..అదుపు తప్పింది.. పైలెట్ ఏం చేశారంటే.. Viral Video
Plane Crash
Follow us on

Flight Accident:  అప్పుడెప్పుడో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తన దేశానికి ఎన్నో సేవలు అందించింది ఆ యుద్ద విమానం. దాన్ని మళ్ళీ అదే స్థాయిలో ప్రజలకు చూపించేందుకు ప్రయత్నించగా.. అదుపుతప్పి కూలిపోయింది. ఈ ఘటన ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. అక్కడ పాత యుద్ధ విమానాలతో ఓ షో నిర్వహిస్తున్నారు. అకస్మాత్తుగా ఒక విమానం అదుపుతప్పింది. దాని పైలెట్ విమానాన్ని ఎమర్జెన్సీ లాండింగ్ చేయాలను కున్నారు. కానీ అనువైన ప్రదేశం లభించలేదు. దీంతో సముద్రంలో దింపేశారు. ఆ సమయంలో బీచ్ లో జనం ఉన్నారు. వారికి ఏమీ ప్రమాదం జరగలేదు. ఈ విమాన దృశ్యాలను అక్కడ ఉన్నవారు వీడియోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇపుడు ఈ వీడియోలు వైరల్ గా మారాయి.

ఫ్లొరిడాలోని కోకో బీచ్ ఎయిర్ షోలో ఈ అపశృతి చోటుచేసుకుంది. రెండో ప్రపంచం కాలం నాటి యుద్ధ విమానం గాల్లో విన్యాసాలు చేస్తూ సముద్రంలో కూలింది. అయితే, ఈ విమానంలో ఉన్న పైలెట్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. విమానం గాల్లో ప్రదర్శనలు ఇస్తు్న్న సమయంలో ఒక్కసారే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్‌ దాన్ని కిందికి దింపాల్సి వచ్చింది. తిరిగి ఎయిర్‌పోర్టులో వెళ్లడం కష్టమని భావించి విమానాన్ని సముద్రంలోనే దింపేయాలని నిర్ణయించాడు. దీంతో సముద్ర తలానికి చాలా దగ్గరగా తక్కువ ఎత్తులో విమానాన్ని నడిపాడు. ఆ సమయంలో బీచ్‌లో పర్యాటకులు స్నానాలు చేస్తున్నారు. అయితే, పైలెట్ చాకచక్యంగా విమానాన్ని సముద్రంలోనే దింపేశాడు. దీంతో జనాలు షాకయ్యారు. తరువాత ఎవరికీ ప్రమాదం జరగలేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజనులు పైలెట్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ప్రమాద వీడియోను ఈ కింది వీడియోలలో చూడండి..

 

Also Read: Headless Creature: పోలాండ్‌లో తల, కాళ్లు లేని వింత జంతువు.. దాని గురించి తెలిస్తే షాకవుతారు… ( వీడియో )

వానరం దాహార్తిని తీర్చిన వ్యక్తి.. బుద్దిగా కూర్చున్న కోతి.. ఆకట్టుకుంటున్న వీడియో..