Crime Video: పాలల్లో విషం కలిపి నెలల బిడ్డను చంపేసిన రాక్షసి.. ఆస్తిలో వాటా కోసమే..!
తన భర్త మొదటి భార్యకు పుట్టిన ఐదు నెలల పాపకు తాగించే పాలలో విషం కలిపి హత్య చేసిన ఆరోపణలపై దేవమ్మ అనే గృహిణిని కర్ణాటకలోని యాదగిరి గ్రామీణ ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. దారుణ ఘటనకు కారణం ఏంటని ఆరా తీయగా షాకింగ్ వాస్తవాలు బయటపడ్డాయి. వివరాల్లోకెళితే.. బబలా గ్రామానికి చెందిన సిద్ధప్ప బెట్టిగేరికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య శ్రీదేవికి సంతానం కలగకపోవడంతో...
తన భర్త మొదటి భార్యకు పుట్టిన ఐదు నెలల పాపకు తాగించే పాలలో విషం కలిపి హత్య చేసిన ఆరోపణలపై దేవమ్మ అనే గృహిణిని కర్ణాటకలోని యాదగిరి గ్రామీణ ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. దారుణ ఘటనకు కారణం ఏంటని ఆరా తీయగా షాకింగ్ వాస్తవాలు బయటపడ్డాయి. వివరాల్లోకెళితే.. బబలా గ్రామానికి చెందిన సిద్ధప్ప బెట్టిగేరికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య శ్రీదేవికి సంతానం కలగకపోవడంతో ఏడేళ్ల కిందటే దేవమ్మను సిద్ధప్ప వివాహం చేసుకున్నాడు. శ్రీదేవి దగ్గర ఉండి తన భర్తకు వివాహం చేయించింది. దేవమ్మకు నలుగురు బిడ్డలు పుట్టారు. మరోవైపు ఐదు నెలల కిందట శ్రీదేవి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపకు సంగీతా బెట్టిగేరి అని ఇటీవలే పేరు పెట్టారు. ఆగస్టు 30న తన చిన్నారి ఏడుస్తుండడంతో పాలు పట్టించాలని దేవమ్మకు చెప్పి , శ్రీదేవి ఇంటి పని చేసుకునేందుకు వెళ్లింది. ఆ బిడ్డకు ఆస్తిలో వాటా వెళుతుందన్న అక్కసుతో దేవమ్మ పాలలో విషం కలిపి తాగించింది. పాలు తాగిన మూడు గంటల్లోనే ఆ బిడ్డ చని పోయింది. సాధారణ మృతి అని భావించినా వైద్య పరీక్షల్లో విష ప్రయోగంతోనే బిడ్డ మరణించిందని వైద్యులు ప్రకటించారు. శ్రీదేవి ఫిర్యాదుతో దేవమ్మను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఆమె తన నేరాన్ని అంగీకరించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..