శివంగిలా మారిన స్కూల్ అమ్మాయి.. వేధించిన యువకుడిని నడిరోడ్డుపై చితకబాదింది.. వీడియో వైరల్..

|

Mar 15, 2021 | 10:58 AM

ఎక్కడ చూసిన అమ్మాయిలపై ఆకతాయిల వేధింపులు మరింత పెరుగుతున్నాయి. స్కూల్స్, కాలేజీలు, ఉద్యోగాలకు వెళ్ళే మహిళలకు నిత్యం ఆకతాయిల వేధింపులు

శివంగిలా మారిన స్కూల్ అమ్మాయి.. వేధించిన యువకుడిని నడిరోడ్డుపై చితకబాదింది.. వీడియో వైరల్..
Meerut Girl Beats Stalker W
Follow us on

ఎక్కడ చూసిన అమ్మాయిలపై ఆకతాయిల వేధింపులు మరింత పెరుగుతున్నాయి. స్కూల్స్, కాలేజీలు, ఉద్యోగాలకు వెళ్ళే మహిళలకు నిత్యం ఆకతాయిల వేధింపులు జరుగుతున్నా.. పరువు పోతుందనే భయంతో.. లేదా ఎదురు తిరిగితే తమనేమైన చేస్తారనే భయంతో చాలా మంది అమ్మాయిలు భయపడిపోతూ.. సైలెంట్ గా ఉంటున్నారు. అయితే ఓ అమ్మాయి మాత్రం అలా నిశబ్బంగా ఊరుకోలేదు. తనను వేధిస్తున్న అబ్బాయికి ఎదురుతిరిగింది. స్కూల్ అమ్మాయి శివంగిలా మారి.. తనను వేధించిన యువకుడిని నడిరోడ్డుపై చితకబాదింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఉత్తర్ ప్రదేశ్‏లోని మీరట్‏ సదర్ బజార్ ప్రాంతానికి చెందిన ఓ ఇద్దరు స్కూల్ అమ్మాయిలను ఇద్దరు యువకులు నిత్యం వేధిస్తున్నారు. రోజూ పాఠశాలకు వెళ్లే దారిలో వారిద్దరి వెంటపడుతూ.. తీవ్రంగా వేదించేవారు. ఈ క్రమంలో అందులోని ఓ అమ్మాయి… ఆ యువకులకు ఎదురుతిరిగింది. తమను నిత్యం వేధిస్తున్న యువకులకు ఎలాగైన బుద్దిచేప్పాలని నిర్ణయించుకుంది. వెంటనే ఓ పదునైన కర్రతో అందులో ఓ అబ్బాయి పైకి తిరగబడింది. నడిరోడ్డుపై కర్రతో కోడుతూ.. అతడికి బుద్ది చెప్పింది. దీంతో అక్కడే ఉన్నవారందరూ గూమిగూడారు. దీంతో ఆ అబ్బాయి క్షమాపణలు చెప్పాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఆ యువతిని ఆపే ప్రయత్నం చేస్తున్న ఆ అమ్మాయి మాత్రం అసలు వినిపించుకోలేదు. తన చేతిలోని కర్రతో ఆ యువకుడిని చితకబాదింది. అమ్మాయి  ఆ యువకుడిని వదిలిపెట్టిన అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన ఫోన్ లో వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేయగా.. అదికాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అమ్మాయి ధైర్యానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. అమ్మాయిలు తమను తాము రక్షించుకోవడానికి ధైర్యంగా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:

ఎగురుతూ వచ్చి బొక్కబోర్ల పడ్డ పక్షి.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్న వీడియో.. ఎలాగో మీరు చూడండి..

International Question day 2021: అల్బర్ట్ ఐన్‏స్టీన్ పుట్టిన రోజును క్వశ్చన్ డేగా ఎందుకు జరుపుకుంటామో తెలుసా?