Viral Video : వెంట్రుకవాసిలో చావునుంచి తప్పించుకున్నారు..!వీడియో చుస్తే అలానే ఉంది మరి..

Updated on: Sep 09, 2021 | 9:42 AM

గత కొంతకాలంగా దేశం యావత్తు ప్రకృతి ప్రకోపాన్ని చవి చూస్తోంది. భారీ వర్షాలు, వరదలతో పలు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. అనేక చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి, చెట్లు నేలకూలాయి.. విద్యుత్‌ నిలిచిపోయింది..అయితే..

గత కొంతకాలంగా దేశం యావత్తు ప్రకృతి ప్రకోపాన్ని చవి చూస్తోంది. భారీ వర్షాలు, వరదలతో పలు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. అనేక చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి, చెట్లు నేలకూలాయి.. విద్యుత్‌ నిలిచిపోయింది.. అనేక మంది నిరాశ్రయులయ్యారు.. అయితే ఆ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. పలు చోట్ల కొండచరియలు విరిగి పడుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లో అకస్మాత్తుగా పెద్ద పెద్ద బండరాళ్లు విరిగి పడ్డాయి. అయితే ఆ సమయంలో పెద్ద ప్రమాదమే తప్పింది. మీరు మీ బైక్ తో కొండదారిలో వెళుతున్నారు. ఇంతలో అకస్మాత్తుగా కొండమీద నుంచి బండరాళ్ళు దొర్లుకుంటూ వచ్చి రోడ్డుమీద పడ్డాయి. త్రుటిలో మీరు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.. అప్పుడు మీకెలా అనిపిస్తుంది? ఆ దృశ్యం చూస్తేవాళ్లకు మాత్రం ఒళ్ళు గగుర్పొడుస్తుంది. సరిగ్గా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీలో సెప్టెంబరు 6న రోడ్డుపై అకస్మాత్తుగా పెద్ద పెద్ద రాళ్లు పడటం ప్రారంభించాయి. అదే సమయంలో, ఇద్దరు యువకులు ఆ రోడ్డు మీదుగా స్కూటీపైన వెళ్తున్నారు. అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదం నుంచి వారు తృటిలో తప్పించుకున్నారు. అంతకుముందు సెప్టెంబరు 6న, హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఇదేవిధంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో ఇక్కడ మీరూ చూసేయండి.. ఈ సంఘటన చంబాకు 15 కి.మీ ముందు రిషికేష్-గంగోత్రి జాతీయ రహదారిపై నాగ్ని పెట్రోల్ పంపు దగ్గర జరిగింది. భారీ బండరాళ్లు, కొండపై నుంచి రాళ్లు పడడంతో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో హైవే మూసివేశారు. దీని కారణంగా దానికి ఇరువైపులా వాహనాల క్యూలు నిలిచిపోయాయి. విద్యుత్, నీటి లైన్లతో పాటు, జడ్ధార్ గ్రామానికి వెళ్లే రహదారి, ప్రధాన ద్వారం కూడా భారీ బండరాయి పడడంతో ధ్వంసమైపోయింది..

మరిన్ని ఇక్కడ చూడండి: Taliban: అఫ్గాన్‌ పౌరులకు ఎనలేని కష్టాలు.. తాలిబన్ల చెరలో విమానాలు..!విమానంలో అందరూ వాళ్ళే(వీడియో)

Technology Video: ఏఐ టెక్నాలజీతో అద్భుతాలు.. ఎడారిలో మంచినీరు తయారుచేసే రోబో.. (వీడియో)

Know This video: ఇదేం.. ఎస్కేప్‌ సామీ.!చెంచాలతో సొరంగం తవ్వి జైల్‌ నుంచి పరార్(వీడియో).

తాలిబన్లకు అండగా పాక్‌.! పంజ్‌షీర్‌లో పాక్‌ విమానం చక్కర్లు..!(వీడియో): Pakistan Plane In Afghan Video.

Loading...
Unable to load recommendations.
Follow Us