క్రెడిట్‌ కార్డ్‌ యాక్టివేట్‌ చేస్తామంటూ.. బ్యాంక్‌ అకౌంట్‌ లూఠీ

|

May 31, 2024 | 1:10 PM

సైబర్‌ మోసాల పట్ల ప్రజల్లో అనేక రకాలుగా అవగాహన కల్పిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలంటూ భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కుతూ మోసపోతున్నారు. ఇటు పోలీసుశాఖ, అటు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ ఎంత అవగాహన కల్పించినా ఏదో ఒకచోట ప్రజలు సైబర్‌ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేస్తామని నమ్మబలికి కార్డులో ఉన్న డబ్బు మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు కాజేసిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

సైబర్‌ మోసాల పట్ల ప్రజల్లో అనేక రకాలుగా అవగాహన కల్పిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలంటూ భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కుతూ మోసపోతున్నారు. ఇటు పోలీసుశాఖ, అటు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ ఎంత అవగాహన కల్పించినా ఏదో ఒకచోట ప్రజలు సైబర్‌ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేస్తామని నమ్మబలికి కార్డులో ఉన్న డబ్బు మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు కాజేసిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ఎన్టీఆర్ కాలనిలో నివాసం ఉంటున్న నూరిళ్ల, రిజ్వనా అనే భార్య భర్తలిద్దరినీ సైబర్ నేరగాళ్ళు బురిడీ కొట్టించారు. నూరిళ్ల, భార్య రిజ్వనాకు చెరొకటి కొన్ని రోజుల క్రితం RBL బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డులు ఇంటికి వచ్చాయి. ఆ తరువాత వాటిని యాక్టివేట్ చేయాలనీ సైబర్ నేరగాళ్ళు భార్య, భర్తలకు ఇద్దరికీ కాల్ చేసి నమ్మబాలికారు. వారిని నమ్మిన నూరిళ్ల తన సెల్ కు వచ్చిన ఓటీపీ లు వారికీ చెప్పడంతో వెంటనే అకౌంట్ నుంచి మొదటి సారి 51 వేల 445 రూపాయలు, రెండవ సారి 51 వేల 475 రూపాయలు ఇలా విడతల వారీగా ఒక లక్షా 85 వేల రూపాయల నగదు కాజేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కరోనా తరహా మరో సంక్షోభం తప్పదు.. బ్రిటన్‌ హెచ్చరిక

మౌంట్ ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జాం.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

 

Follow us on