Nuclear Weapons: అంత‌రిక్షంలో ర‌ష్యా అణ్వాయుధాలు.? ఆందోళ‌న‌ చెందుతున్న అమెరికా.

|

Feb 17, 2024 | 7:28 PM

అంత‌రిక్షంలో అణ్వాయుధాల‌ను మోహ‌రించేందుకు ర‌ష్యా ప్లాన్ చేస్తున్న‌ట్లు అమెరికా పేర్కొంది. తమ జాతీయ భ‌ద్ర‌త‌కు ఇది తీవ్ర విఘాతంగా మారే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అమెరికా తెలిపింది. న్యూయార్క్ టైమ్స్‌లో దీనికి సంబంధించిన క‌థ‌నం వ‌చ్చింది. అమెరికా శాటిలైట్ వ్య‌వ‌స్థ‌ను.. ర‌ష్యా అంత‌రిక్ష అణ్వాయుధం ప్ర‌మాదంలోకి నెట్టివేస్తుంద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. దీనిపై ఇంటెలిజెన్స్ అధికారులు నివేదిక‌ను త‌యారుచేశారు.

అంత‌రిక్షంలో అణ్వాయుధాల‌ను మోహ‌రించేందుకు ర‌ష్యా ప్లాన్ చేస్తున్న‌ట్లు అమెరికా పేర్కొంది. తమ జాతీయ భ‌ద్ర‌త‌కు ఇది తీవ్ర విఘాతంగా మారే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అమెరికా తెలిపింది. న్యూయార్క్ టైమ్స్‌లో దీనికి సంబంధించిన క‌థ‌నం వ‌చ్చింది. అమెరికా శాటిలైట్ వ్య‌వ‌స్థ‌ను.. ర‌ష్యా అంత‌రిక్ష అణ్వాయుధం ప్ర‌మాదంలోకి నెట్టివేస్తుంద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. దీనిపై ఇంటెలిజెన్స్ అధికారులు నివేదిక‌ను త‌యారుచేశారు. ప్ర‌స్తుత ద‌శ‌లో అంత‌రిక్ష ఆయుధాన్ని ఢీకొనే వ్య‌వ‌స్థ త‌మ వ‌ద్ద లేద‌ని అమెరికా అంటోంది. ర‌ష్యా ఆయుధం వ‌ల్ల అంత‌రిక్షంలోని క‌మ్యూనికేష‌న్‌, నిఘా వ్య‌వ‌స్థ ధ్వంసం అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు రిపోర్టులో తెలిపారు. 1967లో కుదిరిన ఔట‌ర్ స్పేస్ ట్రీటీని ర‌ష్యా ఉల్లంఘిస్తుందా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఆ ఒప్పందం ప్ర‌కారం అన్ని ర‌కాల అంత‌రిక్ష అణ్వాయుధాల‌పై నిషేధం ఉంది. నిజానికి అంత‌రిక్షంలో అణ్వాయుధాన్ని ర‌ష్యా మోహ‌రిస్తుందో లేదో తెలియ‌దు. కానీ అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రం అధ్య‌క్షుడు బైడెన్‌కు రిపోర్టును అందించారు. అయితే నివేదికకు సంబంధించిన పూర్తి స‌మాచారాన్ని కాంగ్రెస్ స‌భ్యుల‌కు తెలియ‌జేయాల‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..