ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం

Updated on: Jan 02, 2026 | 4:56 PM

రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తిరుపతిలో హెల్మెట్ వాడకం తప్పనిసరి చేశారు. "నో హెల్మెట్-నో పెట్రోల్" వంటి కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన పెరిగింది. ఆర్టీఏ గణాంకాలు ప్రమాదాల తీవ్రతను స్పష్టం చేయడంతో, అధికారులు, వ్యాపారులు సైతం ప్రాణాల రక్షణకు హెల్మెట్ ప్రాముఖ్యతను చాటుతున్నారు. నూతన సంవత్సర కానుకలుగా హెల్మెట్ బొకేలు కూడా ఆకర్షిస్తున్నాయి.

ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనదారులకు హెల్మెట్‌ ఆవశ్యకతగురించి అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. టెంపుల్‌ సిటీ తిరుపతిలో నో హెల్మెట్‌-నో పెట్రోల్‌ అంటూ పోలీసులు వాహనదారులను అలర్ట్‌ చేశారు. తిరుపతి పోలీసు యంత్రాంగం తెచ్చిన హెల్మెట్ తప్పనిసరి అమలు విధానానికి ప్రజలలో మంచి స్పందన వచ్చింది. దీంతో.. వ్యాపారులు కొత్తగా ఆలోచించి ఇదే రీతిలో హెల్మెట్ల వాడకంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి పరిసరాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల తీవ్రత ను ఆర్టీఏ అధికారుల గణాంకాలు కూడా స్పష్టం చేస్తున్నడంతో కట్టడి చేసే ప్రయత్నంలో హెల్మెట్ వాడకం తప్పనిసరిగా అధికార యంత్రాంగం అమలు చేస్తోంది. చలానా భయంతో కాకుండా ప్రాణాలపై అక్కరతో కుటుంబ సభ్యులపట్ల బాధ్యతతో హెల్మెట్ ధరించాలని అధికారులు కోరుతున్నారు. ఇక వ్యాపారులు కూడా తాము సైతం అంటున్నారు. ఇందులో భాగంగానే కొందరు వ్యాపారులు న్యూ ఇయర్ విషెస్ తెలిపే వారి కోసం హెల్మెట్ బొకేలను అందుబాటులోకి తెచ్చారు. ఆత్మీయులకు, బంధుమిత్రులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూనే ప్రాణాలు కాపాడే హెల్మెట్ బోకేలు అందించేలా హెల్మెట్ బొకేలు ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Lunar Eclipse 2026: మార్చి 3న తొలి చంద్రగ్రహణం

కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్

క్రిస్మస్ సెలవులకి బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్‌ ఫ్రీ

నో వెయిటింగ్‌.. నో పుషింగ్‌.. శ్రీవారి సన్నిధిలో కొత్త టెక్నాలజీ సూపర్‌ సక్సెస్‌