మన ఖర్మ బాగాలేకపోతే.. ఇంతేనేమో ??

Updated on: Nov 17, 2025 | 5:16 PM

కర్నూలు జిల్లా మహానందిలో స్నేక్ క్యాచర్ మోహన్ ఒకే రోజు రెండు సాహసోపేతమైన పాము పట్టివేతలు చేశారు. రైతు ఇంట్లో చొరబడిన 7 అడుగుల కోడె నాగును, ఆ తర్వాత ప్రమాదానికి గురైన కారులో ఉన్న కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ రెండు పాములను అటవీ ప్రాంతంలో విడిచిపెట్టి, మోహన్ తన నైపుణ్యాన్ని, ధైర్యాన్ని చాటారు. గ్రామస్థులు, చిన్నారులు ఆయనను అభినందించారు.

సాధారణంగా రోడ్డుపై డ్రైవ్ చేసేటప్పుడు ఎదురుగా వచ్చే.. వాహనాలు, మనుషులు, పెద్ద జంతువులను చూసి జాగ్రత్తగా బండి నడుపుకుంటూ పోతుంటారు వాహనదారులు. అదే చిన్ని చిన్న పాములు లాంటివైతే గుర్తించడం కష్టం. అదీ రాత్రివేళ అయితే అసలు కనిపించవు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోది. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి బైక్‌పైన దూసుకెళ్తున్నాడు. ఓ మూల మలుపు తిరిగే క్రమంలో అతని బైకు కింద ఓ నాగుపాము పడింది. అది చిన్నగా ఉండటంతో బైకర్‌కి కనిపించలేదు. మళ్లీ అతను బైకు రివర్స్‌ తీసే క్రమంలో ఆ పాముకి దగ్గరగా వెళ్లాడు. అప్పటికే ఆ చిన్న నాగుపాము పడగవిప్పి నిల్చుంది.ఏంటా ఇది అనుకుంటూ వంగి పరిశీలిస్తుండగా.. ఒక్కసారిగా ఆ నాగుపాము అతన్ని కాటువేసింది. అయితే.. ఈ లోగానే అతడు వెనక్కి తిరగటంతో ఆ పాము తనను కాటు వేసిందని అతను గుర్తించలేకపోయాడు. అక్కడి నుంచి గబగబా వెళ్లే క్రమంలో అతడు బైకుపైనుంచి పడిపోయాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియో బైకర్ పరిస్థితి గురించి స్పష్టంగా వెల్లడించలేదు. అతను బతికి ఉన్నాడా లేదా అనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే, ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు బైక్ ప్రమాదవశాత్తూ పాముపైకి దూసుకెళ్లిందని, ఆత్మరక్షణ కోసం పాము కరిచిందని అన్నారు. మరికొందరు బైకర్ రోడ్డుపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని, అతన్ని నిందించారు. కొందరు దీనిని కర్మఫలంగా అభివర్ణించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో…అక్కడికెలా వెళ్లావురా సామీ !!

EPF: పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పన్ను కట్టాలా ??

తొక్కే కదా అని లైట్‌ తీసుకోకండి.. ఇలా వాడి చూడండి

ఈ జనం మారరా ?? కోట్లాది మంది పాస్‌వర్డ్‌ ఒకటే !!

రూ.20 వేలా ?? ఐఫోన్‌ పౌచ్‌పై ట్రోలింగ్‌