LIon and Rhinocer: మాములుగా లేదుగా వీడియో.. సింహాల గుంపును పరుగులు పెట్టించిన ఖడ్గమృగం.. వైరల్
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జంతువులలో సింహాలు ఒకటి. వీటిని చూస్తే ఎంతటి జంతువైనా భయపడాల్సిందే. సింహం వేట మొదలు పెట్టిందంటే అవతలి జంతువుకి చావు ఖాయమనే చెప్పాలి. ఎంతటి రారాజైనా ఒక్కోసారి ఓటమి చవిచూడక తప్పదు.
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జంతువులలో సింహాలు ఒకటి. వీటిని చూస్తే ఎంతటి జంతువైనా భయపడాల్సిందే. సింహం వేట మొదలు పెట్టిందంటే అవతలి జంతువుకి చావు ఖాయమనే చెప్పాలి. ఎంతటి రారాజైనా ఒక్కోసారి ఓటమి చవిచూడక తప్పదు. సరిగ్గా ఇక్కడా అదే జరిగింది. సింహాల గుంపునే హడలెత్తించింది ఓ ఖడ్గ మృగం. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొన్ని సింహాలు ఒకచోట నీళ్లు తాగుతున్నాయి… అదే నీటి కుంటను దాటి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది ఒక పెద్ద ఖడ్గమృగం. అయితే అది అలా రావడాన్ని గమనించిన సింహాలు నీళ్లు తాగడం ఆపేసి, ఖడ్గమృగాన్ని ఎటాక్ చేసాయి. వాటిలో ఒక సింహం ఖడ్గమృగాన్ని వెనుక నుంచి పట్టుకుని తన పదునైన పళ్ళతో కొరికేందుకు ప్రయత్నించింది. దానికి మద్దతుగా మిగిలిన సింహాలు కూడా చేరిపోతాయి. అయితే ఖడ్గమృగం తన ప్రాణాలను కాపాడుకోవడానికి తన శక్తినంతా కూడదీసుకొని సింహాలను ఎదుర్కొంటుంది. ఖడ్గమృగం ప్రతిఘటనకు సింహాలు వెనక్కి తగడంతో ఖడ్గమృగం పారిపోతుంది. గెలవాలనే సంకల్పం దృఢంగా ఉంటే.. ఎంతటి ప్రమాదమైనా తలవంచక తప్పదంటున్నారు ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి.
మరిన్ని చూడండి ఇక్కడ:
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..
Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)
anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)
