Viral Video: ఇదేందిది.. ఇంటిపైన కొబ్బరిచెట్టా..! ఇలా కూడా పెంచుతారా !!

Updated on: Nov 17, 2025 | 11:57 AM

నంద్యాల జిల్లాకు చెందిన రెహమాన్, తన కొత్త ఇంటి నిర్మాణంలో అడ్డుగా ఉన్న కొబ్బరి చెట్టును తొలగించడానికి నిరాకరించాడు. మొక్కల పట్ల తన అమితమైన ప్రేమను చాటుకుంటూ, చెట్టు చుట్టూ ఖాళీ స్థలం వదిలి ఇంటిని నిర్మించాడు. ఇప్పుడు ఆ చెట్టు ఇంటికంటే ఎత్తుగా పెరిగి, ఇంటిపై భాగంలో అందంగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది పర్యావరణ పరిరక్షణకు, మొక్కల పెంపకానికి గొప్ప ఉదాహరణ.

కొందరు మొక్కలను ప్రాణంగా పెంచుకుంటారు. అవి ఎండిపోయినా.. ఏదైనా చీడ పట్టినా ఎంతగానో బాధపడిపోతారు. వాటిని తమ బిడ్డల్లా అపురూపంగా చూసుకుంటారు. కొన్ని సందర్భాల్లో వాటిని తొలగించాల్సి వచ్చినా అందుకు వారు ఒప్పుకోరు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఓ వ్యక్తి తన ఇల్లు నిర్మించుకునే క్రమంలో చెట్టు అడ్డు వచ్చింది. అయినా అతను దానిని తొలగించలేదు సరికదా.. ఏం చేశాడో మీరే చూడండి. నంద్యాల జిల్లా బేతంచెర్ల కోటపేట కు చెందిన రెహమాన్‌కి మొక్కలంటే అమితమైన ఇష్టం. అతని ఇంటి ఆవరణలో ఓ కొబ్బరి చెట్టును నాటాడు. అది చక్కగా పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో అతని ఇల్లు శిధిలావస్థకు చేరడంతో దానిని తొలగించి కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలనుకున్నాడు. అయితే ఇంటిని కాస్త పెద్దగా కట్టుకోవాలని ప్లాన్‌ చేసుకోగా ఈ కొబ్బరి చెట్టు అడ్డుగా మారింది. దానిని తొలగించాలని సూచించారు. అందుకు అతను ససేమిరా అన్నాడు. కొబ్బరిచెట్టును అలాగే ఉంచి ఇంటి నిర్మాణానికి ప్లాన్‌ వేయించాడు. ఇంటికి ఓ పక్కగా చెట్టు వచ్చింది. చెట్టు చుట్టూ ఓపెన్‌గా ఉంచి ఇంటి నిర్మాణం పూర్తిచేశారు. ఆ చెట్టుకూడా ఆనందంగా కళకళలాడుతూ పెరిగింది. ఇప్పుడు ఆ ఇంటికంటే ఎత్తుగా ఎదిగి కప్పులా కనిపిస్తోంది. చూస్తే ఇంటిపైన కొబ్బరిచెట్టు నాటారా అన్నట్టుగా అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో రెహమాన్‌ను అందరూ అభినందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీడు మనిషి కాదు.. మహానుభావుడు బాస్.. అలా ఎలా పట్టేసాడు

Published on: Nov 17, 2025 11:55 AM