రూ. 5 వేలకు కోటిన్నర ప్రాపర్టీ మీ సొంతం

Updated on: Oct 06, 2025 | 6:55 PM

ఇటీవల కొందరు వ్యక్తులు కొత్తరకం వ్యాపారం మొదలు పెట్టారు. తమకు సంబంధించిన భూములు, ఇళ్లు అమ్మకోడానికి కొత్త కొత్త ఐడియాలు వేస్తున్నారు. ఆ మధ్య యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చౌటుప్పల్‌ దగ్గర తనకు ఉన్న 66 గజాల ప్లాటును అమ్మడానికి లక్కీడ్రా స్కీము ఏర్పాటు చేశాడు. రూ.500 రూపాయలతో కూపన్‌ కొని లక్కీ డ్రాలో ప్లాటును సొంతం చేసుకోమని ఏకంగా ప్లెక్సీలు వేసి మరీ ప్రచారం చేశాడు.

తాజాగా అలాంటి ఘటనే మరోటి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ ను విక్రయించాలనుకున్నాడు యజమాని శ్రీనివాస్ రెడ్డి. అందుకు గానూ లక్కీడ్రాని ఏర్పాటు చేశాడు. రూ.5001 తో కూపన్ తీసుకొని కోటిన్నర విలువగల ప్రాపర్టీని సొంతం చేసుకోండి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నాడు. 2,500 కూపన్‌లు కొట్టించి విక్రయానికి పెట్టాడు. లక్కీడ్రాలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా కోటిన్నర ప్రాపర్టీ, రెండవ బహుమతిగా రెండు తులాల బంగారం, మూడో బహుమతిగా కిలో వెండి పెట్టినట్లు ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లాడ్జి యజమాని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ లక్కీ డ్రా జనవరి 14వ తారీకు తీయనున్నట్లు తెలిపారు. దీంతో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి భారీగా కూపన్లు కొంటున్నట్టు సమాచారం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దారుణం.. దసరాకు సెలవు ఇవ్వలేదని పసికందు ఉసురు తీశారు

విరిగిపడిన కొండచరియలు.. ఆరుగురు మృతి

మాయదారి మహమ్మారికి నవ వధువు బలి

దడ పుట్టిస్తున్న బంగారం ధర.. మండిపోతున్న వెండి..

రోజుకో ఉసిరికాయ తింటే ఏమవుతుందో తెలిస్తే..