రామ భజన పాడిన 19 ఏళ్ల కశ్మీరీ ముస్లిం యువతి

|

Jan 18, 2024 | 7:27 PM

ఓ కశ్మీరీ ముస్లిం యువతి పాడిన రామ్ భజన నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ మహత్తర ఘట్టం కోసం కోట్లాది మంది వేచి చూస్తున్నారు. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రాముడు... రామమందిరం గురించే చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఓ ముస్లిం యువతి పాడిన రామ్ భజన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జమ్ము కశ్మీర్‌కు చెందిన సయ్యద్ బటూల్ జెహ్రా అనే 19 ఏళ్ల యువతి పహారీ భాషలో రామ్ భజనను ఆలపించింది.

ఓ కశ్మీరీ ముస్లిం యువతి పాడిన రామ్ భజన నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ మహత్తర ఘట్టం కోసం కోట్లాది మంది వేచి చూస్తున్నారు. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రాముడు… రామమందిరం గురించే చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఓ ముస్లిం యువతి పాడిన రామ్ భజన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జమ్ము కశ్మీర్‌కు చెందిన సయ్యద్ బటూల్ జెహ్రా అనే 19 ఏళ్ల యువతి పహారీ భాషలో రామ్ భజనను ఆలపించింది. ఆమె పాట నెటిజన్ల మనసును గెలుచుకుంది. గాయకుడు జుబిన్ నౌటియాల్ హిందీలో పాడిన రామ్ భజన తనను పాడేందుకు ప్రేరేపించిందని ఆమె తెలిపారు. యూట్యూబ్‌లో హిందీలో జుబిన్ పాడిన రామ భజనను చూశానని… తొలుత హిందీలో పాడానని, బాగా నచ్చిందని.. దీంతో పహారీ భాషలో పాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థిగా ప్రీషా

Simhachalam: సింహాచల అప్పన్న ఆలయ వేడుకలో అరుదైన ఘటన..

అయోధ్య రాముడికి సికింద్రాబాద్ నుంచి భారీ లడ్డూ

అవును.. ఆ హీరోయిన్‌తో సంబంధం ఉంది.. బాంబు పేల్చిన స్టార్ డైరెక్టర్

బుడ్డోడే కానీ.. బండోడే కానీ.. బాబును చూస్తే రచ్చ చేయాల్సిందే