బంకులో సిగరెట్ తాగొద్దు అన్నందుకు..ఏం చేశాడో తెలుసా!
మద్యం మత్తులోనో లేక అహంకారమో తెలీదు కానీ, ఓ యువకుడు చేసిన వెర్రి పని ఇద్దరి ప్రాణాలనే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న వందలాది మందిని ప్రమాదంలోకి నెట్టేసింది. పెట్రోల్ బంకులో సిగరెట్ వెలిగించొద్దని చెప్పినందుకు ఏకంగా ఫ్యూయల్ ట్యాంకులో లైటర్ విసిరేసిన షాకింగ్ ఘటన ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో చోటుచేసుకుంది.
ఫిబ్రవరి 18 రాత్రి ఇద్దరు యువకులు బైక్‌పై పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చారు. బండిపై వెనుక కూర్చున్న వ్యక్తి, అత్యంత ప్రమాదకరమని తెలిసి కూడా అక్కడే సిగరెట్ వెలిగించే ప్రయత్నం చేశాడు. తోటి మిత్రుడు అది చూసి మందలించడంతో, సహనం కోల్పోయిన ఆ యువకుడు వెర్రి కోపంతో తన చేతిలో ఉన్న లైటర్‌ను మండుతున్న వెలుగుతోనే నేరుగా బైక్ పెట్రోల్ ట్యాంకులోకి విసిరేశాడు.లైటర్ పడగానే ట్యాంకు నుంచి ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదాన్ని చూసి నిందితులు పారిపోగా, అక్కడ ఉన్న బంకు సిబ్బంది ఏమాత్రం భయపడకుండా వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. వారి సమయస్ఫూర్తి వల్ల పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ ఆ మంటలు ప్రధాన స్టోరేజ్ ట్యాంకులకు పాకి ఉంటే పరిస్థితి భయంకరంగా ఉండేది. ఘటన అనంతరం పారిపోతున్న ఇద్దరినీ స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు.
మరిన్ని వీడియోల కోసం :