పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే

Updated on: Apr 06, 2026 | 6:20 PM

పెళ్లి ముందు వేగంగా బరువు తగ్గడానికి మౌంజారో ఇంజెక్షన్లపై యువత ఆసక్తి చూపుతున్నారు. అందంగా కనిపించాలనే సామాజిక ఒత్తిడి దీనికి కారణం. అయితే, ఇది తాత్కాలిక పరిష్కారమే. ఈ ఇంజెక్షన్ల వల్ల రోగనిరోధక శక్తి తగ్గి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలున్నాయి. వీటి దీర్ఘకాలిక ప్రభావాలు ఇంకా తెలియవు. సరైన ఆహారం, వ్యాయామానికి ఇవి ప్రత్యామ్నాయం కాదు. వైద్య పర్యవేక్షణ లేకుండా వాడటం అత్యంత ప్రమాదకరం.

పెళ్లికి ముందు బరువు తగ్గే సులువైన మార్గాల వెతుకులాటలో ప్రత్యేక ఇంజెక్షన్లపై ప్రస్తుతం యువత ఆసక్తి చూపుతున్నారు. పెళ్లికి ముందు వ్యాయామం, ఆహార నియమాలతో ఆశించిన ఫలితాలు రాలేదంటూ సడన్‌గా బరు వు తగ్గేందుకు ‘మౌంజారో’ ఇంజెక్షన్‌ తీసుకోవడం ఈ మధ్య పెళ్లీడు యువతలో బాగా పెరిగింది. వీటి వినియోగం వేలంవెర్రిగా పెరిగిపోతోంది. పెళ్లి రోజున నాజూగ్గా, అందంగా కనిపించాలనే తాపత్రయం కారణంగా భారత్‌లో ఇదొక కొత్త ట్రెండ్‌గా మారింది. ఇది ఎక్కడివరకు వెళ్లిందంటే… ఢిల్లీలోని ఓ క్లినిక్‌ ఏకంగా ‘మౌంజారో బ్రైడ్‌’పేరిట ఓ ప్రత్యే క ప్యాకేజీని ప్రకటించింది. మరికొన్ని క్లినిక్‌లు.. చర్మ, కేశాలంకరణతోపాటు ఈ ఇంజెక్షన్లను ప్రీ–వెడ్డింగ్‌ ప్యాకేజీల్లో చేర్చే వరకు పరిస్థితి ఏర్పడింది. మనదేశంలో మధుమేహం, బరువు తగ్గుదల కోసం అను మతి పొందిన తొలి జీఎల్‌పీ–1 మందు ‘మౌంజారో. దీన్ని ఎలి లిల్లీ సంస్థ ఉత్పత్తి చేసి విక్రయిస్తోంది. దీని పోటీ దారు నోవో నార్‌డిస్క్‌ తయారుచేసిన ‘వెగోవీ’కూడా అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో సంప్రదాయ వివాహాల్లో వధువు, వరుడి శారీరక రూపం, ఆర్థిక స్థితికి సంబంధించి అధిక ప్రాధాన్యత ఇవ్వడం మరొక కారణం. పెళ్లిలో ఒక నిర్దిష్ట పద్ధతిలో కనిపించాలనే సామాజిక ఒత్తిడి మరో కారణం. గతేడాది భారత్‌లో ఈ రెండు సంస్థలు తమ ఊబకాయ నివారణ మందులను విడుదల చేయగా, కొన్ని నెలల్లోనే మౌంజారో అమ్మకాలు రెట్టింపయ్యాయి. ఈ మందులు ఊబకాయం ఉన్నవారిగా వర్గీకరించిన పెద్దలు లేదా మధుమేహం, అధిక రక్తపోటు లేదా స్లీప్‌ అప్నియా వంటి బరువు సంబంధిత వైద్య పరిస్థితితో అధిక బరువు ఉన్నవారి కోసం ఉద్దేశించినవి. భారత్‌లో మౌంజారో ఇంజెక్షన్‌ పెన్‌ అత్యల్ప డోస్‌ ధర నెలకు రూ.13,125, గరిష్ట డోస్‌ ధర రూ. 25,781గా ఉంది. ఎలాంటి వెయిట్‌లాస్‌ చికిత్స అయినా సడన్‌గా బరువు తగ్గితే రోగ నిర్ధారణ శక్తికి నష్టం జరుగుతుంది. అందువల్ల వైద్యుడిని సంప్రదించకుండా ‘ఓవర్‌ ద కౌంటర్‌’గా ఈ మందులు తీసుకోవడం అత్యంత ప్రమాదకరం. ఈ ఇంజెక్షన్లను మెడిసిన్‌గా వాడాలే తప్ప జ్వరం, ఒళ్లు నొప్పులకు క్రోసిన్‌ టాబ్లెట్‌గా వాడకూడదు. ఈ మందులతో సడన్‌గా బరువు తగ్గితే తీవ్రమైన ఇమ్యునో డిప్రెషన్‌తో క్షయ, ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదముంది. ఈ బరువు తగ్గుదల మందులు కూడా శాశ్వత పరిష్కారంకాదు. ఈ ఇంజెక్షన్లను తీసుకోవడం ఆపేస్తే వెంటనే బరువు పెరుగుతారు. సాధారణంగా అయితే 6 నెలల నుంచి ఏడాది వరకు ఈ మందులను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ మెడిసిన్‌ మార్కెట్లోకి వచ్చి ఏడాదే అవుతోంది. అందువల్ల వీటి దీర్ఘకాల ప్రభావాలు, దు్రష్పభావాలు ఏమిటనేది ఇంకా పూర్తిస్థాయిలో తెలియడం లేదు. మంచి ఆహారం, వ్యాయామానికి ఇది ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత.. ఏం చేసిందో చూడండి

మళ్లీ కట్టెల పొయ్యిలపై ప్రజల వంటలు.. బయో గ్యాస్‌కూ పెరిగిన డిమాండ్‌ !!

ఇంతందంగా ఉన్నావే.. నెలవంకలా భూమి

క్రికెట్ మ్యాచ్‌లో వివాదం.. కత్తిపోట్లతో యువకుడి మృతి

Weather Update: తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న తుఫాను ముప్పు

Follow Us