వలలో కొండచిలువ.. ఇంట్లో నాగుపాములు..బాబోయ్‌!

Updated on: Feb 22, 2026 | 5:03 PM

సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో గత కొన్ని రోజులుగా పాముల సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. నివాస ప్రాంతాల్లోకి చొరబడిన రెండు భారీ కొండచిలువలు, మూడు విషపూరితమైన నాగుపాములను ప్రముఖ స్నేక్ క్యాచర్ మూర్తి చాకచక్యంగా బంధించి, సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఈ పాములు పట్టుబడ్డాయి. చిత్రావతి నదిలో చేపల కోసం వేసిన వలకు ఒక భారీ కొండచిలువ చిక్కడంతో మత్స్యకారులు భయాందోళనకు గురయ్యారు. కలెక్టరేట్ సమీపంలో మరో భారీ కొండచిలువ ప్రత్యక్షమై కలకలం రేపింది. గోకులంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైంది. ఒకే ఇంట్లో రెండు నాగుపాములు, మరో ఇంట్లో ఒక నాగుపాము చొరబడటంతో స్థానికులు పరుగులు తీశారు. ఆయా ప్రాంతాలనుంచి స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ మూర్తి, ప్రాణాలకు తెగించి కొండచిలువలు, నాగుపాములను సురక్షితంగా పట్టుకున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, బంధించిన ఈ పాములను పుట్టపర్తి మండలం అమగొండ పాలెం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. మూర్తి సమయస్ఫూర్తిని, సాహసాన్ని స్థానికులు అభినందించారు.

మరిన్ని వీడియోల కోసం :

తొందరేంటి.. కనీసం చెప్పేవరకు ఆగరా..?

ఎర్ర బటన్, పచ్చ బటన్ ఐబొమ్మ రవి పరిస్థితి ఇదే!

టీజర్ లాంఛ్ లో విశ్వక్ సేన్ క్రేజీ కామెంట్స్

క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే

Published on: Feb 22, 2026 04:08 PM
Follow Us