జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది

Updated on: Jan 02, 2026 | 4:58 PM

పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. స్వగ్రామానికి వచ్చిన ఎన్ఆర్ఐ హర్పీందర్ సింగ్ తన రక్షణ కోసం తెచ్చుకున్న తుపాకీతోనే ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఇంట్లో సోఫాలో నుంచి లేస్తుండగా నడుములోని తుపాకీ పేలి కడుపులోకి తూటా దూసుకెళ్లింది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. ఈ వైరల్ వీడియో ప్రస్తుత కాలంలో జీవితం ఎంత అస్థిరమో చూపిస్తోంది.

ప్రస్తుత కాలంలో ఇంటినుంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి చేరేవరకూ గ్యారంటీ లేదా అనిపిస్తుంది. ఓ ఎన్ఆర్‌ఐ ఊహించని విధంగా మృత్యువాత పడ్డాడు. తన రక్షణ కోసం వెంట తెచ్చుకున్న తుపాకీయే అతని ప్రాణాలు పోయేందుకు కారణమైంది. ఈ ఘటన పంజాబ్‌లో జరిగింది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని ధని సుచా సింగ్‌ గ్రామానికి చెందిన హర్పీందర్‌ సింగ్‌ అలియాస్‌ సోనూ కొన్నేళ్ల పాటు విదేశాల్లో ఉండి ఇటీవలే స్వగ్రామానికి తిరిగొచ్చాడు. ఇంట్లో సోఫాలో కూర్చుని బంధువుతో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఏదో పనిమీద ఇంట్లోకి వెళ్లేందుకు సోఫా నుంచి లేచే సమయంలో నడుము వద్ద ఉన్న తుపాకీ అనుకోకుండా పేలింది. దీంతో తూటా నేరుగా అతడి పొట్టలోకి దూసుకెళ్లింది. తుపాకీ శబ్దంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమై అతడిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం భఠిండాకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో హర్పీందర్‌ మృతి చెందాడు. మృతుడికి రెండున్నరేళ్ల కుమార్తె ఉంది. ఘటనపై పోలీసులు మృతుడి తండ్రి నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈవీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం

Lunar Eclipse 2026: మార్చి 3న తొలి చంద్రగ్రహణం

కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్

క్రిస్మస్ సెలవులకి బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్‌ ఫ్రీ