జైళ్లల్లోనే ఖైదీల‌కు దాంప‌త్య జీవితం.. ఎక్కడంటే ??

|

Sep 29, 2022 | 9:54 AM

ఇక ఖైదీలు జైళ్లలోనే త‌మ భాగ‌స్వాముల‌తో ఏకాంతంగా గడ‌పొచ్చు. మూడు నెల‌ల‌కు ఒక‌సారి రెండు గంట‌ల చొప్పున దాంప‌త్య జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు.

ఇక ఖైదీలు జైళ్లలోనే త‌మ భాగ‌స్వాముల‌తో ఏకాంతంగా గడ‌పొచ్చు. మూడు నెల‌ల‌కు ఒక‌సారి రెండు గంట‌ల చొప్పున దాంప‌త్య జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు. వారికి ఎలాంటి అంత‌రాయం క‌ల‌గ‌కుండా, జైలు ఆవ‌ర‌ణ‌లోనే అటాచ్డ్ బాత్రూంతో ఉన్న గ‌దిని కూడా ఏర్పాటు చేశారు. ఇది మరెక్కడో కాదు. మ‌న దేశంలోని పంజాబ్ జైళ్లల్లోనే. స‌త్ప్రవ‌ర్తన క‌లిగిన ఖైదీల‌కు ఈ సదావకాశం క‌ల్పిస్తూ పంజాబ్ జైళ్ల శాఖ నిర్ణయం తీసుకుంది. మొద‌ట‌గా గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైలు, న్యూ డిస్ట్రిక్ట్ జైలు, భ‌టిండాలోని వుమెన్ జైలులో ఈ అవ‌కాశం క‌ల్పించారు. దీర్ఘకాలంగా జైల్లో గడుపుతున్న ఖైదీల‌కు మొద‌ట ప్రాధాన్యం ఇస్తున్నారు. తొలి రోజు 21 జంట‌లు ఏకాంతంగా గ‌డిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వుమెన్ జైలులో 4 జంట‌లు, న్యూ డిస్ట్రిక్ట్ జైల్లో 5, గోయింద్వాల్ సాహిబ్ జైల్లో 12 జంట‌లు త‌మ దాంప‌త్య జీవితంలో మునిగి తేలాయి. ఇలా మూడు నెల‌ల‌కు ఒక‌సారి రెండు గంట‌ల చొప్పున అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. అయితే కరడుగట్టిన నేరస్థులు, గ్యాంగ్‌స్టర్లు, తీవ్రవాదులు, హెచ్‌ఐవి వంటి తీవ్రమైన అంటు వ్యాధులతో బాధపడుతున్న వారికి ఏకాంతంగా గ‌డిపే అవ‌కాశం ఉండదని అధికారులు తేల్చి చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తల్లిని ఆటపట్టిస్తూ పిల్ల ఎలుగుబంటి రచ్చ.. ఏం చేసిందో తెలుసా ??

బుద్ధిలేని మాస్టర్.. క్లాస్‌రూమ్‌లోనే మందేసి చిందులు.. పైపెచ్చు…

తవ్వకాల్లో బయటపడ్డ వేల ఏళ్ల నాటి గుహ.. అందులో ఏమున్నాయో చూస్తే కళ్లు జిగేల్‌..

విశాల్ ఇంటిపై దాడి.. భయాందోళనలో హీరో ఫ్యామిలీ

ఆసుపత్రిలో దీపిక !! గుండె పనితీరుపై డాక్టర్ల వార్నింగ్

 

Published on: Sep 29, 2022 09:53 AM