AP News: సీజైన బండి స్పేర్ పార్టులను కొట్టేసి అడ్డంగా దొరికిన పోలీసు

|

Aug 23, 2024 | 4:04 PM

కొంతమంది కక్కుర్తి ఖాకీలు రోజుకింత డిపార్టుమెంటు పరువును గంగల కల్పుతున్నట్టే ఉన్నది వెలుగుచూస్తున్న ఘటనలను చూస్తుంటే. ఏపీలోని అగలి పోలీస్టేషన్‌లో పనిచేస్తున్నహెడ్ కానిస్టేబుల్ ఓ కేసులో సీజైన బండి స్పేర్ పార్టులను పీక్కొచ్చి మెకానిక్ షాపు దగ్గర త బండికి పీటింగు చేయించుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు.

కొందరు పోలీసులు డిపార్ట్‌మెంట్ పరువు తీస్తున్నారు. డబ్బుకు ఆశపడి… తప్పుడు పనులు చేసేవారికి సాయం అందిస్తున్నారు. ఇంకొందరు అయితే.. మొహమాటం లేకుండా లంచాలు అడిగేస్తున్నారు. ఇటీవల ఏపీలోని నందిగామలో ఓ దొంగ నుంచి సొత్తు రికవరీ చేసిన పోలీసులు.. అందులోని కొంత సొమ్ము నొక్కేసి.. సస్పెన్షన్‌కు గురయ్యారు. తాజాగా సత్యసాయి జిల్లా అగలి పోలీస్టేషన్‌కు చెందిన మరో పోలీసులు బాగోతం బయటపడింది. కేసులో సీజైన బండి స్పేర్ పార్టులను ఇప్పేపి.. ఈ కక్కుర్తి కానిస్టేబుల్ గారు తన బండికి ఫిట్టింగ్ చేయించుకోడాన్ని గమనించిన బాధితుడు.. ఆ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..