Viral Video: జనానికి అనుకూలంగా పోలీసులు.. మొన్న ACP.. ఇప్పుడు CI ఏం చేశారో చూడండి.
కొద్ది రోజుల క్రితం బెంగళూరులో రోడ్డుపై బస్సు ఆగిపోతే.. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఏకంగా ఏసీపీనే బస్సు నడిపిన విషయం గుర్తుంది కదా.. ఇప్పుడు అలాంటి సీనే తెలంగాణలో జరిగింది. భద్రాద్రి జిల్లా పాల్వంచ కిన్నెరసానిలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని సందర్శించారు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్. త్వరలోనే ప్రారంభోత్సవం జరుపుకోబోతున్న ఈ స్టేషన్‌కి సంబంధించి జరుగుతున్న పనుల్నిపరిశీలిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం బెంగళూరులో రోడ్డుపై బస్సు ఆగిపోతే.. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఏకంగా ఏసీపీనే బస్సు నడిపిన విషయం గుర్తుంది కదా.. ఇప్పుడు అలాంటి సీనే తెలంగాణలో జరిగింది. భద్రాద్రి జిల్లా పాల్వంచ కిన్నెరసానిలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని సందర్శించారు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్. త్వరలోనే ప్రారంభోత్సవం జరుపుకోబోతున్న ఈ స్టేషన్‌కి సంబంధించి జరుగుతున్న పనుల్నిపరిశీలిస్తున్నారు. అంతలో స్టేషన్ ఆవరణలో ఓ ట్రాక్టర్ లెవలింగ్ చేయకుండా ఖాళీగా ఉండటంతో లెవలింగ్ పనులు ఎందుకు కొనసాగడం లేదని సిబ్బందిని ఆరా తీశారు . ట్రాక్టర్ డ్రైవర్ భోజనానికి వెళ్ళాడని అతను రావడానికి సమయం పడుతుందని చెప్పడంతో తానే స్వయంగా ట్రాక్టర్ ఎక్కారు. దాన్ని డ్రైవ్ చేస్తూ లెవెలర్ తో ప్రాంగణంలోని ఎత్తుపల్లాలను సరి చేశారు. ఆ సీన్ చూసిన కానిస్టేబుళ్లకు నోట మాట రాలేదు. స్టేషన్ పనులు త్వరగా పూర్తి కావాలన్న ఆలోచనతో స్వయంగా సీఐ ట్రాక్టర్ డ్రైవ్ చేస్తూ లెవలింగ్ పూర్తి చేయడం తోటి పోలీసుల్నే కాదు.. ఆ దృశ్యాలను చూస్తున్న వారిందర్నీ ఆకర్షించింది, ఆలోచింపజేసింది. బాధ్యత గల అధికారి.. అంతే బాధ్యతగా వ్యవహరించడాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...