Viral Video: అపస్మారక స్థితిలో పైలెట్‌.. సేఫ్‌ ల్యాండ్‌ చేసిన పాసింజర్‌.! ఒక్కసారిగా ఊపిరి పిల్చున్న ప్రయాణికులు..

|

May 19, 2022 | 9:28 AM

ఫ్లైట్స్‌లో పైలెట్స్ గుండె పోటుకు గురైనప్పుడు.. లేదా పైలెట్స్‌ను టెర్రరిస్టులు చంపేసినప్పుడు.. ఫ్లైట్ గురించి ఏమాత్రం తెలియని అందులోని ప్రయాణీకుడు.. విమానాన్ని నడిపి, ప్రయాణీకులకు క్షేమంగా గమ్యస్థానాలకు తీసుకువచ్చిన


ఫ్లైట్స్‌లో పైలెట్స్ గుండె పోటుకు గురైనప్పుడు.. లేదా పైలెట్స్‌ను టెర్రరిస్టులు చంపేసినప్పుడు.. ఫ్లైట్ గురించి ఏమాత్రం తెలియని అందులోని ప్రయాణీకుడు.. విమానాన్ని నడిపి, ప్రయాణీకులకు క్షేమంగా గమ్యస్థానాలకు తీసుకువచ్చిన ఘటనలు సినిమాల్లో చూశాం. కానీ ఇప్పుడు అలాంటి ఓ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన వార్తే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. సెస్నా లైట్ ఎయిర్‌క్రాఫ్ట్ నడుపుతున్న పైలట్ ప్రయాణం మధ్యలో ఉండగా.. అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో చాపర్‌లో పైలెట్‌తో పాటు ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నాడు. ఆ ప్రయాణీకుడు పైలెట్‌ను తిరిగి సాధారణ స్థితిలోకి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అతడే రంగంలోకి దిగాడు. చాపర్‌ను అదుపు చేయడమే కాకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సహాయంతో విమానాన్ని సురక్షితంగా విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Electrician Love: అబ్భా ప్రేమ ఎంత పనైనా చేయిస్తుంది అంటే ఇదే మరి..! గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం ఎలక్ట్రీషియన్ వింత పని..!

Viral Video: దాని కోసం ఇలా చేస్తారా..? భర్త ఇంట్లో బాత్ రూమ్ లేదని భార్య ఆత్మహత్య..!

Published on: May 19, 2022 09:28 AM