Bachulors: పెళ్లి కాని వాళ్లకు పెన్షన్..! ఆ ప్రభుత్వం వినూత్న నిర్ణయం..
హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెళ్లి కాని వారికి పెన్షన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. 45 నుంచి 60 ఏళ్ల వయసున్న, పెళ్లి కాని వారిని ఇందుకు అర్హులుగా గుర్తించనుంది. ఈ మేరకు కొత్త పథకం ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది హర్యానా సర్కార్.
హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెళ్లి కాని వారికి పెన్షన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. 45 నుంచి 60 ఏళ్ల వయసున్న, పెళ్లి కాని వారిని ఇందుకు అర్హులుగా గుర్తించనుంది. ఈ మేరకు కొత్త పథకం ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది హర్యానా సర్కార్. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా వెల్లడించారు. నెల రోజుల్లోగా ఈ పథకంపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు. కర్నాల్‌లో జరిగిన జన్ సంవద్ కార్యక్రమంలో ఖట్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ 60 ఏళ్ల పెళ్లి కాని వ్యక్తి మాట్లాడుతూ.. పింఛను దరఖాస్తు విషయంలో తాను సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. దీనికి సీఎం బదులిస్తూ.. ‘45 ఏళ్లు పైబడిన వివాహం కాని మహిళలు, పురుషులకు నెలవారీ పింఛను ఇచ్చేలా కొత్త పథకం తీసుకు రానున్నట్లు తెలిపారు. నెలరోజుల్లో ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు విధి విధానాలు ఖరారు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. అలాగే వృద్ధాప్య పింఛనును.. వచ్చే ఆరు నెలల్లో 3 వేల రూపాయలకు పెంచనున్నట్లు సీఎం తెలిపారు
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...