పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే
మహారాష్ట్రలో భూసావల్–బద్నేరా ప్యాసింజర్ రైలు ఇంజిన్‌లో ఇరుక్కుపోయిన జాతీయ పక్షి నెమలిని రైల్వే సిబ్బంది, పోలీసులు కలిసి సురక్షితంగా రక్షించారు. షేగావ్ స్టేషన్‌లో గుర్తించిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఎలాంటి గాయాలు కాకుండా బయటకు తీశారు. అనంతరం వన్యప్రాణి సంరక్షణ సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రైల్వే సిబ్బంది మానవత్వాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
రైలు పట్టాలపై జంతువులు, పక్షులు ప్రమాదాల బారిన పడటం చూస్తుంటాం. కానీ, వేగంగా వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఇంజిన్ ముందు భాగంలో ఒక నెమలి చిక్కుకుపోయింది. పాపం అక్కడినుంచి అది బయటకు రాలేక నరకయాతన పడుతోంది. ఇంతలో దానిని గమనించిన రైల్వే సిబ్బంది, పోలీసులు కలిసి సురక్షితంగా నెమలికి రక్షించారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో భూసావల్-బద్నేరా ప్యాసింజర్ రైలు వేగంగా దూసుకెళ్తోంది. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో ఒక నెమలి అకస్మాత్తుగా ఇంజిన్ కప్లింగ్ డెక్ లో ఇరుక్కుపోయింది. రైలు షేగావ్ స్టేషన్‌కు చేరుకున్నప్పుడు, ఇంజిన్ ముందు భాగంలో గట్టిగా ఇరుక్కుపోయి కదలలేక బాధపడుతున్న ఆ పక్షిని రైల్వే సిబ్బంది గమనించారు. వెంటనే అప్రమత్తమైన వారు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు, స్థానికులతో కలిసి తక్షణమే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. జాతీయ పక్షి అయిన ఆ నెమలికి ఎలాంటి గాయం కాకుండా, ఎంతో చాకచక్యంగా, మెల్లగా ఇంజిన్ లోంచి బయటకు తీశారు. అనంతరం ఆ నెమలిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేందుకు వన్యప్రాణి సంరక్షణ సిబ్బందికి అప్పగించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యాకే రైలు స్టేషన్ నుండి ముందుకు కదిలింది. ప్రాణాపాయం నుంచి నెమలిని కాపాడిన రైల్వే సిబ్బందిని, స్థానికులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యబాబోయ్.. అపార్ట్‌మెంట్ పక్కన ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం!
116 ఏళ్ల నవనీతమ్మ సంకల్పం.. వెతికి మరీ VIP దర్శనం కల్పించిన టీటీడీ
Basara: బాసర జ్ఞానసరస్వతి గర్భాలయం మూసివేత!
రాజస్థాన్‌లో రాక్షసకాండ! 13 ఏళ్ల బాలికపై 30 మంది మృగాళ్ల అరాచకం
