Paytm FASTag: అప్పటిలోగా కొత్త ఫాస్టాగ్‌లను కొనుగోలు చేయాలి.! ఫాస్టాగ్ కస్టమర్లకు NHAI కీలక సూచన

|

Mar 14, 2024 | 7:09 PM

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలతో అనుసంధానించిన ఫాస్టాగ్‌లను ఉపయోగిస్తున్నవారికి ఎన్‌హెచ్ఏఐ కీలక సూచన చేసింది. మార్చి 15 లోగా కొత్త ఫాస్టాగ్‌లను కొనుగోలు చేయాలని బుధవారం కోరింది. ఆర్బీఐ కఠిన ఆంక్షల నేపథ్యంలో మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ ఖాతాలతో లింక్ అయి ఉన్న ఫాస్టాగ్‌లపై టాప్-అప్ లేదా రీఛార్జులు సాధ్యపడవని స్పష్టం చేసింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలతో అనుసంధానించిన ఫాస్టాగ్‌లను ఉపయోగిస్తున్నవారికి ఎన్‌హెచ్ఏఐ కీలక సూచన చేసింది. మార్చి 15 లోగా కొత్త ఫాస్టాగ్‌లను కొనుగోలు చేయాలని బుధవారం కోరింది. ఆర్బీఐ కఠిన ఆంక్షల నేపథ్యంలో మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ ఖాతాలతో లింక్ అయి ఉన్న ఫాస్టాగ్‌లపై టాప్-అప్ లేదా రీఛార్జులు సాధ్యపడవని స్పష్టం చేసింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. జాతీయ రహదారులపై ప్రయాణ సమయంలో జరిమానాలు, రెట్టింపు ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు నూతన ఫాస్టాగ్‌లు కొనుగోలు చేయడం ఉత్తమమని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పేటీఎం ఫాస్టాగ్‌లకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత బ్యాంకులను కస్టమర్లు సంప్రదించవచ్చని సూచించింది. హెచ్ఎంసీఎల్ ఇండియన్ హైవే మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా సమాచారాన్ని తెలుసుకోవచ్చని పేర్కొంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌‌పై ఆర్బీఐ విధించిన ఆంక్షల ప్రకారం.. మార్చి 15 తర్వాత ఫాస్టాగ్‌లను రీఛార్జ్ చేసుకునే అవకాశం లేకపోయినా.. అప్పటికే ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌ను ఫాస్టాగ్ చెల్లింపుల కోసం ఉపయోగించవచ్చు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us on