చిట్టీల పేరుతో కుచ్చుటోపీ.. కోట్లు దండుకొని పరార్!
నమ్మకమే పెట్టుబడిగా, అమాయక ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్న మరో చీటీల మోసం చిత్తూరు జిల్లా పలమనేరులో వెలుగుచూసింది. పట్టణంలోని బోయవీధికి చెందిన ప్రముఖ చీటీల వ్యాపారి వెంకట్రావు, సుమారు రూ. 14 కోట్లకు ఐపీ పెట్టేసి రాత్రికి రాత్రే పరారు కావడంతో బాధితులు రోడ్డున పడ్డారు. గత 20 ఏళ్లుగా నమ్మకంగా చీటీల వ్యాపారం నిర్వహిస్తున్న వెంకట్రావును స్థానికులు గుడ్డిగా నమ్మారు.
దీనికి తోడు గోల్డ్ షాప్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉండటంతో చిరు వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు, ముఖ్యంగా మహిళలు తమ పొదుపు మొత్తాన్ని ఇతని వద్ద జమ చేశారు. వందలాది మంది వద్ద నుంచి కోట్ల రూపాయల అప్పులు కూడా తీసుకున్నట్లు సమాచారం.వెంకట్రావు ఐపీ దాఖలు చేసి పరారయ్యాడన్న వార్త తెలిసి , బాధితులు భారీ సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. మోసపోయామని తెలిసి గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. న్యాయం చేయాలంటూ నిందితుడి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకుని దాచుకున్న సొమ్ము ఆవిరైపోవడంతో బాధితుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
తొందరేంటి.. కనీసం చెప్పేవరకు ఆగరా..?
ఎర్ర బటన్, పచ్చ బటన్ ఐబొమ్మ రవి పరిస్థితి ఇదే!
టీజర్ లాంఛ్ లో విశ్వక్ సేన్ క్రేజీ కామెంట్స్
క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే
Follow Us