whales: వామ్మో.. ఒకటి కాదు రెండు కాదు.. ఒడ్డుకు 500కి పైగా భారీ తిమింగలాలు.! కళ్లుచెదిరే వీడియో..

|

Oct 16, 2022 | 9:58 AM

న్యూజిలాండ్‌లోని మారమూల చతం దీవుల్లోకి దాదాపు 500పైగా చనిపోయిన తిమింగలాలు కొట్టుకు వచ్చాయి. అయితే ఆ ప్రాంతంలో ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్‌లు చేపట్టలేమని సముద్ర తీర సిబ్బంది తెలిపింది.


న్యూజిలాండ్‌లోని మారమూల చతం దీవుల్లోకి దాదాపు 500పైగా చనిపోయిన తిమింగలాలు కొట్టుకు వచ్చాయి. అయితే ఆ ప్రాంతంలో ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్‌లు చేపట్టలేమని సముద్ర తీర సిబ్బంది తెలిపింది. మొదటగా ఆ బీచ్‌లో 250 తిమింగలాలు కొట్టుకువచ్చాయని ఆ తర్వాత మూడు రోజులకు 240కి పైగా కొట్టుకువచ్చాయిని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో రెస్క్యూ చర్యలు చేపట్టడం చాలా కష్టం అని న్యూజిలాండ్‌ ప్రభుత్వ సాంకేతిక సలహదారుడు లండ్‌ క్విస్ట్‌కి చెప్పారు. ఏక కాలంలో వందల సంఖ్యలో కొట్టుకు వచ్చాయని చెప్పారు. అవి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినప్పుడూ ఏ క్షణమైన పేలిపోవచ్చన్నారు. అందవల్ల వాటిని అలానే వదిలేయాలని అధికారులు నిర్ణయించారు. అవి అలా సహజ సిద్ధంగా కుళ్లిపోవడమే మంచిదంటున్నారు అధికారులు. గతంలో 1918లో సుమారు ఒక వెయ్యి తిమింగలాలు సామూహికంగా చనిపోయి కొట్టుకువచ్చినట్లు తెలిపారు. ఇలా ఆకస్మాత్తుగా వందల సంఖ్యలో తిమింగలాలు చనిపోతున్నాయనేది తెలియడం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అదీగాక అధికారిక గణాంకాల ప్రకారం న్యూజిలాండ్‌లో ఏడాదికి సుమారు 300 సముద్ర జీవులు చనిపోయి కొట్టుకు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Grandfather Marriage: తాత నువ్వు కేక..! తాతయ్య పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ.. అందుకే ఇప్పుడు ఐదో పెళ్లి..

Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్‌ బిల్ట్‌ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Published on: Oct 16, 2022 09:57 AM