ఎందుకూ పనికిరాదని మూలన పడేశారు.. కట్‌చేస్తే.. వేలంలో దాని విలువ తెలిసి షాక్ !!

|

Aug 18, 2022 | 2:58 PM

బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి తన కూతురికి బహుమతిగా ఇచ్చేందుకు 1100 రూపాయలు పెట్టి ఓ పెట్టెను కొన్నాడు. కుమార్తె మెలిస్సాకు ఆ పెట్టెను బహుమతిగా ఇచ్చాడు. 1984లో ఈ ఘటన జరిగింది.

బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి తన కూతురికి బహుమతిగా ఇచ్చేందుకు 1100 రూపాయలు పెట్టి ఓ పెట్టెను కొన్నాడు. కుమార్తె మెలిస్సాకు ఆ పెట్టెను బహుమతిగా ఇచ్చాడు. 1984లో ఈ ఘటన జరిగింది. దాదాపు 40 ఏళ్లు కావస్తోంది. ఇందులో ఇంతకాలం పాత బట్టలు వేసి ఓ మూలన పడేశారు. అదే ఇప్పుడు వారిని లక్షాధికారిని చేసింది. ది మిర్రర్ ప్రకారం, ఆ బాక్స్ లూయిస్ విట్టన్ కంపెనీకి చెందినది. ఇటీవలే ఈ పెట్టెను వేలంలో విక్రయించారు. అప్పుడే దాని విలువ తెలిసింది. ఈ పెట్టెను మెలిస్సా తండ్రి లండన్‌లోని ట్వికెన్‌హామ్ సమీపంలోని సెయింట్ మార్గరెట్ గ్రామంలోని బ్రిక్-ఎ-బ్రాక్ దుకాణం నుంచి కొనుగోలు చేశాడు. మెలిస్సా దాదాపు 40 సంవత్సరాల పాటు ఈ పెట్టెలో బట్టలు ఉంచింది. అయితే గత సంవత్సరం పురాతన వస్తువుల రోడ్‌షోకు ఆమె దానిని తీసుకెళ్లినప్పుడు, ఇది సాధారణ పెట్టె కాదు, అరుదైనది అని తెలిసి ఆమె ఆశ్చర్యపోయింది. ఇది 100 ఏళ్ల నాటి లూయిస్ విట్టన్ బాక్స్ అని తేలింది. దాంతో మెలిస్సా బాక్స్‌ను విక్రయించాలని నిర్ణయించుకుంది. లండన్‌కు చెందిన హాన్సన్స్ వేలం నిర్వాహకులను సంప్రదించగా.. జులై 30 న అరుదైన పెట్టె కోసం వేలం నిర్వహించారు. ఈ వేలంలో ఆ పెట్టె 10 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay Deverakonda: ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు.. ఇబ్బందిగా ఉంది ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేసిన VD

Karthikeya 2: ఇండస్ట్రీలను ఊపేస్తోన్న కార్తికేయ2 !! 3 రోజుల్లోనే దిమ్మతిరిగే రికార్డ్‌

Naga Chaitanya: గర్ల్‌ఫ్రెండ్‌కు ముద్దుపెడుతూ.. పోలీసులకు అడ్డంగా దొరికిన నాగ చైతన్య

కొత్త ట్రెండ్‌ సెట్‌ చేసిన పూజారి !! ఇంగ్లీష్‌లో సత్యనారాయణ వ్రతం !!

అత్యంత ఖరీదైన ‘చెత్త’ వేసే బ్యాగ్ !! ధర తెలిస్తే మూర్ఛ పోవాల్సిందే !!

Follow us on