Viral Video: అవి తెస్తేనే మా పెళ్లికి రండి.. బంధువులకు వధువు కండిషన్.. వీడియో అదుర్స్..
సాధారణంగా పెళ్లిళ్లలో వధూవరులను బంధుమిత్రులు రకరకాల పద్ధతుల్లో ఆటపట్టిస్తుంటారు. స్నేహితుల అల్లరి ఇంక చెప్పనక్కర్లేదు. అయితే ఇక్కడ ఓ నవ వధువు తన పెళ్లి సందర్భంగా బంధుమిత్రులందరికీ ఊహించని షాకిచ్చింది. సాధారణంగా పెళ్లికి సకుటుంబ..
సాధారణంగా పెళ్లిళ్లలో వధూవరులను బంధుమిత్రులు రకరకాల పద్ధతుల్లో ఆటపట్టిస్తుంటారు. స్నేహితుల అల్లరి ఇంక చెప్పనక్కర్లేదు. అయితే ఇక్కడ ఓ నవ వధువు తన పెళ్లి సందర్భంగా బంధుమిత్రులందరికీ ఊహించని షాకిచ్చింది. సాధారణంగా పెళ్లికి సకుటుంబ సపరివారం సమేతంగా విచ్చేయండి అని ఇంటిల్లపాదినీ ఆహ్వానిస్తారు. ఈ వధువుకూడా అందర్నీ ఆహ్వానించింది. కానీ ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చింది. తన పెళ్లికి వచ్చేవారు చిన్న చిన్న గిఫ్ట్‌లు తీసుకొచ్చేటట్టయితే రానక్కర్లేదని చెప్పేసింది. తనకు పెళ్లిలో వారిచ్చే కానుక మినిమమ్ 4 వేలకు తగ్గకుండా ఉండాలని కండిషన్ పెట్టింది. దీంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియలో వైరల్‌గా మారింది.
వధువు తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ వధువు పెట్టిన పోస్ట్‌లో కండీషన్ ఏంటంటే..పెళ్లికి వచ్చే వారికోసం చాలా డబ్బు ఖర్చుపెట్టి ఏర్పాట్లు చేశామని చెప్పింది. అతిథులు, బంధుమిత్రుల కోసం ఓపెన్ బార్‌లో భోజనం ఏర్పాటు చేశామని, అందుకే ఎవరైనా తన పెళ్లికి ఉట్టి చేతుల్తో వస్తే తనకు చాలా బాధగా ఉంటుందని అందులో రాసింది. అంతేకాదు, కనీసం 4,200 రూపాయలకు తగ్గకుండా బహుమతి ఇవ్వాలని ఆహ్వాన పత్రికతో పాటు రాయించింది. అయితే, ఇదంతా బహుమతికి సంబంధించిన విషయం కాదంటూనే, బహుమతి అడగడం తప్పేం కాదని రాసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఇలా బహుమతి కోరే ఆలోచన తప్పు అంటున్నారు చాలా మంది. ప్రేమతో ఇచ్చే బహుమతి వెలకట్టలేనిది అంటూ చాలా మంది చెబుతున్నారు. కొందరు మాత్రం వధువు నిర్ణయాన్ని సమర్థించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...