పేలిన విమానం ఇంజిన్‌.. 27 వేల అడుగుల ఎత్తులో టెన్షన్‌ !

Updated on: Feb 15, 2026 | 3:10 PM

ఇటీవల వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికుల్ని టెన్షన్‌ పెడుతున్నాయి. విమానం ఎక్కితే గమ్య స్థానానికి చేరుకుంటామా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫ్రికాలోని నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. అరిక్‌ ఎయిర్‌ కు చెందిన బోయింగ్‌ 737 విమానం లాగోస్ నుంచి పోర్ట్ హార్కోర్ట్ కు బయలుదేరింది. 27 వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఎడమ ఇంజిన్‌లో భారీ శబ్దం వినిపించింది.

ఏం జరుగుతుందా అని ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఇంజిన్‌లో పేలుడు సంభవించి, లోపలి భాగాలు చెల్లాచెదురై ఫ్యాన్ బ్లేడ్లు విరిగాయి. అయితే అలర్టయిన పైలెట్లు విమానాన్ని బెనిన్ ఎయిర్‌పోర్ట్ వైపు మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు.ల్యాండింగ్ సమయంలో ఇంజిన్ లోపలి భాగాలు బయటకు కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 80 మంది ప్రయాణికులు తృటిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇంజిన్ ఇన్లెట్ భాగం పూర్తిగా విరిగిపోయినట్లు గుర్తించారు. దీనిని ‘ఫ్యాన్ బ్లేడ్ ఆఫ్’ ఘటనగా పరిగణిస్తారట. నైజీరియా ఇన్వెస్టిగేషన్ బోర్డు దర్యాప్తు ప్రారంభించింది. ఫ్యాన్ బ్లేడ్ ఆఫ్ అనేది విమాన ఇంజిన్‌లో తీవ్ర సాంకేతిక లోపాన్ని సూచించే పదం. టర్బోఫ్యాన్ ఇంజిన్‌లో గాలి పీల్చుకునే భాగంలో పెద్ద ఫ్యాన్ బ్లేడ్లు ఉంటాయి. వీటిలో ఒక బ్లేడ్ విరిగి, ఇంజిన్ లోపల నుంచి బయటకు రావడం ప్రమాదకర పరిస్థితికి దారి తీయొచ్చనీ విరిగిన బ్లేడ్ ముక్కలు ఇంజిన్‌, విమానం ఇతర భాగాలను దెబ్బతీయొచ్చని చెబుతున్నారు నిపుణులు.

మరిన్ని వీడియోల కోసం :

వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్

ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు

భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!