Old Woman World Record Video: బలశాలి బామ్మ.. వరల్డ్‌ రికార్డ్‌.. సెంచరీ వయసులో సవాళ్లకు సై అంటున్న బామ్మ.. (వీడియో)

Updated on: Oct 22, 2021 | 9:14 AM

సాధారణంగా 80 ఏళ్లు వచ్చేసరికి తాము ముసలి వాళ్లమైపోయామని, ఇంక తామేమీ చేయలేమని కొందరు భావిస్తారు. మరికొందరు వీరికి భిన్నంగా ఆలోచిస్తారు. అప్పటివరకూ ఉరుకులు పరుగుల జీవితంతో ఏమీ చేయలేకపోయామని....

సాధారణంగా 80 ఏళ్లు వచ్చేసరికి తాము ముసలి వాళ్లమైపోయామని, ఇంక తామేమీ చేయలేమని కొందరు భావిస్తారు. మరికొందరు వీరికి భిన్నంగా ఆలోచిస్తారు. అప్పటివరకూ ఉరుకులు పరుగుల జీవితంతో ఏమీ చేయలేకపోయామని, ఇప్పుడు తమకు విశ్రాంతి దొరికిందని కొందరు తమలో దాగిఉన్న నైపుణ్యతకు పదును పెడతారు. కానీ వీరందరికీ భిన్నంగా.. అదీ ఒక స్త్రీ… తన వందేళ్ల వయసులోనూ పవర్‌ లిఫ్టర్‌గా వరల్డ్‌ రికార్డ్‌ సాధించింది. వయసు కేవలం నెంబర్‌ మాత్రమే నని మరోసారి బరువులెత్తి మరీ నిరూపించింది ఈ బామ్మ…

ఈ ఫోటోలో కనిపిస్తున్న బామ్మగారు తన వయసులోని మిగిలిన మహిళల్లా మూలన కూర్చునే రకం కాదు. సెంచరీ వయసులోనూ సవాళ్లకు సై అనే సాహసి. బరువులెత్తడంలో గొప్ప బలశాలి. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన పవర్‌ లిఫ్టర్‌గా ఇటీవలే గిన్నిస్‌ రికార్డును సైతం బద్దలుకొట్టిన ఈ అమెరికన్‌ బామ్మ పేరు ఎడిత్‌ ముర్వే ట్రయిన్‌. ఇటీవల ఆగస్టు 8న నూరవ పుట్టినరోజు జరుపుకొన్న ఈ బామ్మ తన పుట్టినరోజుకు కొద్దిరోజుల ముందే.. ఆగస్టు 5న గిన్నిస్‌ రికార్డు సాధించింది. వృద్ధుల పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో రికార్డు బద్దలుకొట్టిన ఎడిత్, చిన్నప్పటి నుంచి క్రీడాకారిణి కూడా కాదు. ఆమె ఒక స్థానిక రిక్రియేషన్‌ క్లబ్‌లో డాన్స్‌ ట్రైనర్‌గా పనిచేసేది. రోజూ డాన్స్‌ చేయడం వల్లనే తన శారీరకమైన కదలికల్లో చురుకుదనం ఇప్పటికీ తగ్గలేదని చెబుతుందీ బామ్మ. పోటీల కోసం ప్రత్యేక ఆహారం కూడా ఏమీ తీసుకోవడం, ప్రత్యేకమైన ఎక్సర్‌సైజులు చేయడంలాంటి జాగ్రత్తలేవీ కూడా పాటించలేదట, కానీ రోజూ రాత్రిపూట జిన్‌తో తయారు చేసే ‘మార్టిని’ కాక్‌టెయిల్‌ తీసుకోవడం తనకు అలవాటని, బహుశ ఆ అలవాటే తన చురుకుదనానికి కారణం కావచ్చని ఈ బామ్మ చిరునవ్వులు చిందిస్తూ చెబుతోంది ఈ పవర్‌ లిఫ్టర్‌ బామ్మ.

మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Rush driving Video: ఊరేగింపులో దారుణం.. భక్తులపైకి దూసుకొచ్చిన కారు.. వైరల్ అవుతున్న వీడియో..

Follow Us