తండ్రికి బెదిరింపు లేఖ.. రూ.35 లక్షలు డిమాండ్‌ చేసిన కొడుకు

Updated on: Oct 19, 2025 | 12:33 PM

ఒడిశాలో ఓ వ్యక్తి తన తండ్రిని బెదిరించి రూ.35 లక్షలు డిమాండ్‌ చేశాడు. ఆ డబ్బు ఇవ్వకపోతే కుటుంబాన్ని అంతం చేస్తానంటూ బెదిరింపు లేఖ పంపాడు. ఒడిశాలోని కలహండి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నార్లా పట్టణానికి చెందిన దినేష్ అగర్వాల్ ఆ ప్రాంతంలో పేరున్న కాంట్రాక్టర్. అక్టోబర్‌ 6న మావోయిస్ట్‌ల పేరుతో రాసిన లేఖ ఆయన కారులో కనిపించింది.

రూ.35 లక్షలు ఇవ్వాలని లేకపోతే ఆయన కుటుంబాన్ని అంతం చేస్తామని అందులో బెదిరించారు. దినేష్ అగర్వాల్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అతని వ్యాపార భాగస్వామికి కూడా ఇదే బెదిరింపు లేఖ అందింది. దీంతో అనుమానంతో దినేష్‌ అగర్వాల్‌ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.బెదిరింపు లేఖను పోలీసులు పరిశీలించారు. చేతి రాతతో హిందీలో రాసిన ఆ లేఖలోని విషయాలు అస్పష్టంగా కనిపించాయి. మావోయిస్టు క్యాడర్‌ పేర్లు కూడా తప్పుగా ఉన్నాయి. అలాగే దినేష్‌ కుటుంబానికి వ్యక్తిగత సూచనలు కూడా అందులో చేయడంతో తెలిసిన వ్యక్తి పనిగా పోలీసులు అనుమానించారు. దినేష్‌ కుమారుడు 24 ఏళ్ల అంకుష్ అగర్వాల్‌ ఆ లేఖ రాసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఒక సంస్థలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో మావోయిస్టుల పేరుతో తండ్రిని బెదిరించి రూ.35 లక్షలు వసూలు చేసేందుకు ఈ ప్లాన్‌ వేసినట్లు అంకుష్‌ ఒప్పుకోవడంతో పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేసారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఖరీదైన కాఫీ..కిలో జస్ట్ రూ.25 లక్షలే

క్యాన్సర్ గెలిచింది.. ఇదే నా చివరి దీపావళి యువకుడి ఎమోషనల్ పోస్ట్

టోల్ గేట్లు.. ఇక కనుమరుగు రోడ్లపై కెమెరాలతో టోల్‌ వసూళ్లు

గాల్లో వేలాడుతూ ప్రీ వెడ్డింగ్ షూట్.. ఇదేం క్రియేటివిటీ..

ఆఫీస్‌కి వెళ్లిన ఉద్యోగులకు షాక్.. దీపావళి బహుమతులు ఏంటంటే..