టోల్ ప్లాజాల వద్ద ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్!

Updated on: Feb 23, 2026 | 10:10 AM

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు అలర్ట్. టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల కు స్వస్తి పలికి, వంద శాతం డిజిటల్ లావాదేవీలనే అమలు చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ సిద్ధమవుతోంది. వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది.దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1150 టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడం, రుసుము వసూళ్లలో పూర్తి పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా NHAI ఈ దిశగా అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం దేశంలో టోల్ వసూళ్లు దాదాపు 98 శాతం ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్నాయి. మిగిలిన 2 శాతం నగదు లావాదేవీలను కూడా డిజిటల్ వైపు మళ్లించాలని అధికారులు నిర్ణయించారు. కొత్త నిబంధనల ప్రకారం, ఏప్రిల్ 1 తర్వాత టోల్ ప్లాజాల వద్ద కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే రుసుము చెల్లించాలి. ప్రస్తుతం ఫాస్టాగ్ లేని వాహనాల నుండి రెండింతల ఫీజు వసూలు చేస్తున్నారు. ఒకవేళ అది యూపీఐ ద్వారా చెల్లిస్తే, 1.25 రెట్ల ఫీజు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్ నుంచి నగదు కౌంటర్లు పూర్తిగా కనుమరుగు కానున్నాయి. కాబట్టి ప్రయాణికులు తమ ఫాస్టాగ్‌లను ముందుగానే రీఛార్జ్ చేసుకోవాలని, సాంకేతిక లోపాలు లేకుండా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పూర్తి డిజిటల్ ఎకోసిస్టమ్ ద్వారా హైవేలపై ప్రయాణం మరింత వేగవంతం కానుంది.

మరిన్ని వీడియోల కోసం :

తొందరేంటి.. కనీసం చెప్పేవరకు ఆగరా..?

ఎర్ర బటన్, పచ్చ బటన్ ఐబొమ్మ రవి పరిస్థితి ఇదే!

టీజర్ లాంఛ్ లో విశ్వక్ సేన్ క్రేజీ కామెంట్స్

క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే

Follow Us