New Couple Crying: పెళ్లి పీటలపైనే బోరుమన్న నవదంపతులు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..! వైరల్ అవుతున్న వీడియో

Updated on: Mar 18, 2022 | 9:58 AM

మన దేశంలో పెళ్లి అంటే ఎన్నో సంప్రదాయాలు ఉంటాయి. అలాగే పెళ్లికి ఇచ్చే ప్రాధాన్యత కూడా ఎక్కువే. పెళ్లితో ఇద్దరు మనుషులు మాత్రమే కాదు.. రెండు కుటుంబాలు ఒక్కటిగా కలవడం. అందుకే ఎంతో సంతోషంగా.. బంధుమిత్రుల మధ్య ఘనంగా పెళ్లి వేడుకను జరుపుతుంటారు.


మన దేశంలో పెళ్లి అంటే ఎన్నో సంప్రదాయాలు ఉంటాయి. అలాగే పెళ్లికి ఇచ్చే ప్రాధాన్యత కూడా ఎక్కువే. పెళ్లితో ఇద్దరు మనుషులు మాత్రమే కాదు.. రెండు కుటుంబాలు ఒక్కటిగా కలవడం. అందుకే ఎంతో సంతోషంగా.. బంధుమిత్రుల మధ్య ఘనంగా పెళ్లి వేడుకను జరుపుతుంటారు. ఆ క్షణం వారి జీవితంలోనే అత్యంత ప్రత్యేకం. తాము కోరుకున్నట్టుగానే వారి పెళ్లి జరుగుతుందనే విషయం వారి కళ్లలో కనిపిస్తుంటుంది. సంతోషం.. కన్నీళ్లుగా మారి బయటకు వస్తుంటాయి. నిజమే మరి.. అందుకు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నఈ వీడియోనే సాక్ష్యం. ఆ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు ఒప్పుకుంటారు.వైరల్ అవుతున్న ఈ వీడియోలో వరుడు తన సన్నిహితులతో కలిసి పెళ్లి మండపంలో వధువు కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అయితే అప్పుడే వధువు డేరాలో ఎంట్రీ ఇస్తుంది. వధువును చూడగానే వరుడు ఒక్కసారిగా ఏడవడం ప్రారంభించాడు. ఆ తర్వాత వరుడు దగ్గరకు వచ్చిన వధువు కూడా కన్నీరు పెట్టుకుంది. ఇంతకీ వధూవరులు ఎందుకు ఏడ్చారో ఎవరికీ అర్థం కాలేదు.. కానీ.. ఈ సన్నివేశం చూసి అక్కడున్నవారు కూడా ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..

Python Viral Video: బాబోయ్‌ భారీ కొండచిలువ..! వయ్యారి నడక చూస్తే వణుకే.. ఇలాంటి వీడియో చేస్తే తట్టుకోలేరు..

Kajal Aggarwal: పంచదార బొమ్మ ‘కాజల్ అగర్వాల్’ మరోసారి అదిరిపోయే బేబీ బంప్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది..

Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)

Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Published on: Mar 18, 2022 09:58 AM