Viral Video: నీరజ్ చోప్రాలో దాగి ఉన్న మరో టాలెంట్.. వీడియోలో దుమ్మురేపిన గోల్డెన్ బాయ్

త్రో బ్యాక్ వీడియోలో గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఆకట్టుకున్నాడు. అతడిలో దాగి ఉన్న ఓ కళను బయట పెట్టడంతో వైరల్‌గా మారాడు.

Viral Video: నీరజ్ చోప్రాలో దాగి ఉన్న మరో టాలెంట్.. వీడియోలో దుమ్మురేపిన గోల్డెన్ బాయ్
Neeraj Chopra

Updated on: Aug 14, 2021 | 6:28 PM

Viral Video: నీరజ్ చోప్రా అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి బంగారు పతకాన్ని అందించిన సంగతి తెలిసిందే. దీంతో దేశమంతా మనోడి పేరు మార్మోగిపోతోంది. ఎనలేని క్రేజ్‌తో స్టార్‌గా మారిపోయాడు. ఈమేరకు నీరజ్ చోప్రాకు సంబంధించిన ఏవార్త అయినా సంచలనంగానే మారిపోతోంది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశం మొత్తం 7 పతకాలను సాధించింది. అందులో నీరజ్ గోల్డ్ పతకంతో భారత్ 48వ స్థానంలో నిలిచింది. షూటర్ బింద్రా తరువాత వ్యక్తిగత ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన రెండో భారతీయుడిగా పేరుగాంచాడు.

దీంతో భారత ప్రభుత్వంతోపాటు పలు ప్రైవేట్ కంపెనీలు నీరజ్‌ చోప్రాకు బంఫర్ ఆఫర్‌లు ప్రకటించాయి. అలాగే దేశ వ్యాప్తంగా మనోడికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నెట్టింట్లో నీరజ్ చోప్రాకు సంబంధించిన ఏ వీడియో అయినా తెగ సందడి చేస్తోంది. తాజాగా ఓ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో నీరజ్ చోప్రా ప్రముఖ గాయకుడు దలేర్ మెహందీ పాటకు స్టెప్పులేయడం చూడొచ్చు. ఇంత వరకు నీరజ్ చోప్రాను ఓ ఆటగాడిగానే చూసిన నెటిజన్లు.. మనోడి స్టెప్పులకు ఫిదా అయ్యారు. ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.

ఓ పంక్షన్‌లో ఆగకుండా స్టెప్పులేస్తూ.. తన స్నేహితులతో కలిసి చిందులేశాడు. అయితే ఈ వీడియో స్పష్టంగా లేనప్పటికీ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీనికి నెటిజన్లు కూడా కామెంట్లతో సందడి చేస్తున్నారు. గోల్డెన్ బాయ్ చోప్రా.. హిడెన్ టాలెంట్ సూపర్ అంటూ పలువురు కామెంట్ చేయగా, మన దేశ బంగారం ఇతనంటూ మరికొంత మంది కామెంట్ చేశారు.

ఈ వీడియోను మీరూ చూడండి..

Also Read:

Viral Video: ఇంటి చూరుపై పాముల సయ్యాట.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. జనాలు గద్దించినా

గంజాయి మత్తులో బస్టాండ్‌లో యువకుడి వీరంగం.. పరుగులు పెట్టిన జనం.. చివరకు.. షాకింగ్ వీడియో..

Viral Video: జింకను వేటాడేందుకు నక్కిన చిరుత.. షాకింగ్ సీన్.. వీడియో చూస్తే షాకవుతారు!

Loading...
Unable to load recommendations.
Follow Us