చూస్తుండగానే మనుషులు అదృశ్యం !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

|

Sep 12, 2023 | 4:34 PM

టెలిపోర్టేషన్ గురించి ఎంతోకొంత మీకు తెలిసే ఉంటుంది. ఒక వ్యక్తి ఒక్క అడుగు కూడా వేయకుండా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి అదృశ్యమవడాన్నే టెలిపోర్టేషన్ అంటారు. ఇది సాధ్యం కాకపోయినా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఉన్న మ్యాజిక్‌ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోలో ఒక గాజు పెట్టె లోపల లాక్ చేయబడిన కొందరు వ్యక్తులు అదృశ్యమై.. మరొక గాజు పెట్టెలో దర్శనమిచ్చారు.

టెలిపోర్టేషన్ గురించి ఎంతోకొంత మీకు తెలిసే ఉంటుంది. ఒక వ్యక్తి ఒక్క అడుగు కూడా వేయకుండా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి అదృశ్యమవడాన్నే టెలిపోర్టేషన్ అంటారు. ఇది సాధ్యం కాకపోయినా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఉన్న మ్యాజిక్‌ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోలో ఒక గాజు పెట్టె లోపల లాక్ చేయబడిన కొందరు వ్యక్తులు అదృశ్యమై.. మరొక గాజు పెట్టెలో దర్శనమిచ్చారు.ఈ సీన్‌ను చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. దీనిని టెలిపోర్టేషన్ అంటారు. ఒక పెద్ద గాజు బాక్స్‌లో ఒక పురుషుడు, ముగ్గురు మహిళలు నిలబడ్డారు. అనంతరం ఆ బాక్స్‌ నెమ్మదిగా తిరగడం ప్రారంభించింది. ఇంతలో, ఒక వ్యక్తి వచ్చి ఆ బాక్స్‌ని కర్టెన్‌తో కప్పేసాడు. అతను ఆ పక్కనే ఉన్న మరో బాక్స్‌ను కూడా కవర్ చేసాడు. అదే సమయంలో ఓ అమ్మాయి వచ్చి మొదటి బాక్స్‌ను కవర్ చేసిన తెరను తొలగించింది. అంతే.. అంతకుముందు ఆ బాక్స్‌లో నిలబడిన వ్యక్తులు ఇప్పడు కనిపించకుండా పోయారు. అక్కడే ఉన్న మరో బాక్స్ కవర్ ఓపెన్ చేయగా.. వారంతా అందులో కనిపించారు. ఇదెలా సాధ్యమైందంటూ జనం షాకయిపోయారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను దాదాపు 9 లక్షలమంది వీక్షించారు. 30 వేలమందికి పైగా లైక్‌ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్రికెటర్‌ ఇంట్లో దూరిన కొండచిలువ..ఏం చేశాడో చూడం

Pushpa 2: బంగారం లాంటి అప్డేట్ !! రిలజ్ డేట్ వచ్చేసిందోచ్‌ !!

Miss. Shetty Mr. Polishetty: హాలీవుడ్ గడ్డపై.. పొలిశెట్టి దిమ్మతిరిగే రికార్డ్‌

Lavanya Tripathi: పెళ్లికి ముందే కండీషన్‌ !! విని ఫిదా అయిన చిరు !!

Jawan: వావ్‌ !! అప్పుడే 500కోట్ల క్లబ్‌లో షారుఖ్‌ !!