పోలేరమ్మ గుడిలో అద్భుతం.. అమ్మవారి విగ్రహంపై మరో రెండు కళ్లు ప్రత్యక్షం
ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలం క్రిష్టంశెట్టిపల్లెలో వింత ఘటన భక్తులను ఆకర్షిస్తోంది. పోలేరమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహానికి ఉన్న రెండు కళ్లకు పైన మరో రెండు కళ్లు కనిపిస్తున్నాయి. గత ఐదు రోజులుగా ఈ దృశ్యం కనిపిస్తోందని అర్చకులు చెబుతున్నారు. ఈ ఘటనపై సమాచారం వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా ఆలయానికి చేరుకుంటున్నారు. అమ్మవారి నాలుగు కళ్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి.
ప్రకాశం జిల్లాలో అద్భుత ఘటన చోటుచేసుకుంది. పోలేరమ్మ గుడిలో అమ్మవారి విగ్రహంపై అదనంగా రెండు కళ్లు ప్రత్యక్షమయ్యాయి. మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం క్రిష్టంశెట్టిపల్లెలో ఈ వింత చోటుచేసుకుంది. ఈ వింతను చూసేందుకు స్థానికులు ఆలయానికి పోటెత్తారు. ప్రస్తుతం ఈ ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే, గత ఐదు రోజులుగా అమ్మవారి విగ్రహానికి ఉన్న కళ్ళకు తోడు, వాటి పైన అదనంగా మరో రెండు కళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే.. ఇవి పెట్టుడు కళ్ళు కావనీ, అమ్మవారి తల భాగంలో వాటంతట అవే ఏర్పడ్డాయని అర్చకులు చెబుతున్నారు. ఈ వింత ఘటన గురించి తెలిసి స్థానికులు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. కంచి కామాక్షి అమ్మవారికి ‘నయనం’ ఎంతో ప్రధానం. అలాంటి దివ్యరూపంలో ఉన్న అమ్మవారికి నాలుగు కళ్ళు రావడం సామాన్యమైన విషయం కాదని, గ్రామస్థులు ఎంతో భక్తిభావంతో పూజలు చేస్తున్నారు. ఈ వింత వార్త దావానలంలా వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పోలేరమ్మ ఆలయానికి పోటెత్తుతున్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు, కామాక్షిఅమ్మవారి కటాక్షం కోసం జనం బారులు తీరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మవారి విగ్రహంపై మరో రెండు కళ్లు ప్రత్యక్షం
ఎవరెస్ట్ కరిగిపోతోంది.. కారణం ఇదే!
డీజే సౌండే నా బిడ్డను బలి తీసుకుంది
కంటెంట్ ఉన్నోడికి.. కటౌట్తో పనిలేదు డ్యూడ్!
అంత్యక్రియలు చేసిన తర్వాత 15 రోజులకు తిరిగొచ్చిన కొడుకు
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..

