కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా కానిస్టేబుల్!

Updated on: Aug 04, 2026 | 1:55 PM

ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్‌లో ఒక మహిళా కానిస్టేబుల్ తన సమయస్ఫూర్తితో అద్భుతమైన సాహసం ప్రదర్శించారు. ఆత్మహత్య చేసుకునేందుకు కదులుతున్న లోకల్ ట్రైన్ కింద పడబోయిన 28 ఏళ్ల యువకుడిని ఆమె రెప్పపాటులో కాపాడారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డవడంతో, ఆ కానిస్టేబుల్ ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. యువకుడికి కౌన్సిలింగ్ అందిస్తున్నారు.

ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ అసాధారణమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించి, ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుడి ప్రాణాలను కాపాడి వార్తల్లో నిలిచారు. గురువారం రాత్రి 10 గంటల 54 నిమిషాల సమయంలో జరిగిన ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.ప్లాట్‌ఫారంపై నిలబడిన 28 ఏళ్ల యువకుడు, నెమ్మదిగా కదులుతున్న లోకల్ ట్రైన్ కిందకు వెళ్లేందుకు ఒక్కసారిగా ప్రయత్నించాడు. అక్కడే విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ యనర్వాడే ప్రమాదాన్ని వెంటనే గ్రహించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, రెప్పపాటు కాలంలోనే వేగంగా పరుగెత్తుకెళ్లిన ఆమె, ఆ యువకుడి కాళ్లను గట్టిగా పట్టుకుని వెనక్కి లాగారు.దీంతో ఆ యువకుడు ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనలో అతనికి ఎలాంటి పెద్ద గాయాలు కాలేదని, వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

మళ్లీ మొదటికొచ్చిన డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం

ఇడుపుకాయితం టైటిల్‌పై వచ్చిన విమర్శలు విని బాధ కలిగింది

డబ్బు వాళ్లదే.. కానీ హీరోలు మాత్రం వాళ్లు కాదండోయ్..

పెద్ద రిస్కే తీసుకోబోతున్న అనిల్ రావిపూడి..!

Loading...
Unable to load recommendations.
Follow Us