Monkeys in hospital: ఆస్పత్రిలో వానర దండు.. ఏడుగంటల పాటు రచ్చరచ్చ.. ఆమ్మో మాములుగా లేదుగా..
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో వానరాలు బీభత్సం సృష్టించాయి.. జిల్లాలోని లేడీ లాయల్ ఉమెన్స్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లోని లేబర్ రూమ్‌లోకి అకస్మాత్తుగా ప్రవేశించిన కోతులు దాదాపు 7 గంటల పాటు హల్‌చల్ చేశాయి.
ఆస్పత్రిలోని వస్తువులు, సామాగ్రి మొత్తం చిందర వందరగా చేస్తూ… విధ్వంసం సృష్టించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్పత్రిలోని లేబర్ రూంలోకి కోతులు ప్రవేశించడంతో సీలింగ్ కూల్చివేశాయి. అనంతరం ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులు కమాండ్ దాదాపు 7 గంటలపాటు శ్రమించి కోతులను బయటకు తరిమికొట్టారు.. అయినా ఆస్పత్రి ఆవరణలోని రోగులు, సహాయకులపై దాడి చేస్తూ వారి చేతిలోని ఆహారాన్ని లాక్కుపోతూ నానా రచ్చ చేసాయి. కోతులను తరిమికొట్టేందుకు ఆసుపత్రిలో లంగూర్ బొమ్మను ఉంచినా అవి దాన్ని లెక్క చేయకుండా రెచ్చిపోయి ప్రవర్తించాయి. కోతుల బెడదనుండి రక్షించేందుకు పాలకులు పలు మార్గాలను అవలంబిస్తూ చర్యలు తీసుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
