Monkey in Airport Lounge: విమానాశ్రయ లాంజ్ లో కోతి.. అది చేసిన పని చూస్తే మీరు నవ్వాపుకోలేరు..Viral Video

|

May 23, 2021 | 8:09 PM

Monkey in Airport Lounge: సాధారణంగా జంతువులు చేసే కొన్ని పనులు మనకు భలే సరదాగా అనిపిస్తాయి. జంతువులను ప్రేమించేవారికి అవి చేసే ప్రతిపనీ సంతోషాన్నిస్తుంది.

Monkey in Airport Lounge: విమానాశ్రయ లాంజ్ లో కోతి.. అది చేసిన పని చూస్తే మీరు నవ్వాపుకోలేరు..Viral Video
Monkey In Airport Longue
Follow us on

Monkey in Airport Lounge: సాధారణంగా జంతువులు చేసే కొన్ని పనులు మనకు భలే సరదాగా అనిపిస్తాయి. జంతువులను ప్రేమించేవారికి అవి చేసే ప్రతిపనీ సంతోషాన్నిస్తుంది. ఇక కోతులను మనం తరచూ మన చుట్టూ చూస్తూనే ఉంటాం. వీధుల్లోకి వచ్చి ఆహారం తింటూ ఉండటం.. అలాగే అవి మన ఇళ్ళలోకి చొరబడుతూ ఉండటం.. సాధారణ విషయాలు. ఒక్కోసారి ఇంట్లో ఉన్న ఫ్రిజ్.. వంటింట్లో గిన్నెల్లో ఆహారం తీసుకుని అల్లరి చేయడం మనకి తెలిసిందే. కానీ, విమానాశ్రయ ప్రాంతాల్లో ఎప్పుడన్నా కోతుల్ని చూసిన గుర్తు మీకు ఉందా. మరీ ముఖ్యంగా విమానాశ్రయ లాంజ్ లో .. దీనికి ఎవరైనా నో అని చెబుతారు కచ్చితంగా. అయితే, మీకు ఒక కోతి విమానాశ్రయం లాంజ్ లో చేసిన మజా మస్తీ చూపించేస్తే ఓ పని అయిపోతుంది. ఇది భలే ఉండే అని అనుకుంటారు. నిజానికి ఈ వీడియో ఎప్పుడో 2018 లోనిది.. ఇది మళ్ళీ ఇప్పుడు యూ ట్యూబ్ లో అప్ లోడ్ అయిన తరువాత ఇప్పుడు వైరల్ అయింది.
ఈ వీడియోలో ఒక కోతి డిల్హి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా లాంజ్ లో కనిపించింది. ఇది అక్కడ టేబుల్ మీద ఉన్న ఆహారాన్ని తింటూ సందడి చేసింది. ఒక్క నిమిషం ఆరు సెకన్ల ఈ వీడియో క్లిప్ లో ఒక కోతి ఫుడ్ కౌంటర్ లోని ఒక డిష్ నుంచి.. ఇంకో డిష్ కి మారుతూ ఆహారాన్ని తింటూ ఫుడ్ ఎంజాయ్ చేస్తోంది.

ఇదిగో ఆ వీడియో మీరు ఇక్కడ చూడండి..

ఈ వీడియోను ఆ సమయంలో భారతదేశంలో వ్యాపార పర్యటనలో ఉన్న జెన్నా కర్టిస్ అనే అంతర్జాతీయ పర్యాటకుడు తీశాడు. దీనిగురించి అతను ఇలా చెప్పాడు.. “నేను భారతదేశంలో ఒక వ్యాపార యాత్రలో ఉన్నాను. ఒకరోజు ఢిల్లీ లోని విమానం మారడం కోసం ఎయిర్ ఇండియా లాంజ్‌లో తదుపరి ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్నాను. నేను ఫ్రిజ్ నుండి కొంచెం నీరు తీసుకోవడానికి వెళ్ళాను. నేను వెనక్కి తిరిగినప్పుడు, అక్కడ కూర్చున్న ఒక పెద్ద కోతి అన్ని ఆహారాలను రుచి చూస్తుండటం చూసి నేను షాక్ అయ్యాను. చివరకు అరటిపండును ‘టేకావే’కి పట్టుకునే ముందు ఇది అన్ని ఆహార పదార్ధాల్ చుట్టూ తిరుగాడింది! బహుశా ఇతర లాంజ్లలో ప్రసాదాలను తనిఖీ చేయడానికి కావచ్చు. ”

Also Read: మీకు నేరుగా వ్యాక్సిన్ సరఫరా చెయ్యం, పంజాబ్ రాష్ట్రానికి మోడెర్నా ‘మొండిచెయ్యి’…గ్లోబల్ టెండర్ కి ఆదిలోనే హంసపాదు , నిలిచిపోయిన వ్యాక్సినేషన్

Inter Exams: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇంటి నుంచే పరీక్షలు.. వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం