విద్యుత్‌ స్తంభం ఎక్కిన ఎమ్మెల్యే.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

Updated on: Dec 28, 2025 | 4:26 PM

ఉత్తరాఖండ్‌లో విద్యుత్ కోతలపై ఎమ్మెల్యే వీరేంద్ర నిరసన తీవ్రరూపం దాల్చింది. తన నియోజకవర్గ సమస్యలను పట్టించుకోని అధికారుల నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీనిపై ఆగ్రహించిన విద్యుత్ శాఖ అధికారులు ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఈ ఘటన ఎత్తిచూపుతోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తన నియోజవర్గంలోని సమస్య గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఓ ఎమ్మెల్యే. అయితే అధికారులు ఎమ్మెల్యే విన్నపాన్ని పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహానికి గురైన ఆ ఎమ్మెల్యే నిరసనకు దిగారు. అంతేకాదు..తమకు ఎదురైన సమస్యనే అధికారులకు ప్రత్యక్షంగా అనుభవం అయ్యేలా చేశారు. దీంతో అధికారులు ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరాఖండ్‌లో విద్యుత్ కోతలపై ఝాబ్రేరా నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఏరియాలో నిత్యం 5 నుంచి 8 గంటలు కోత పెడుతున్నారని మండిపడ్డారు. దీనివల్ల ప్రజలతో పాటు చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారని మీడియాకు తెలిపారు. పది రోజుల కింద ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, అయినా అధికారులు పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే వీరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వీరేంద్ర విద్యుత్ స్తంభం ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల నివాసాలకు కరెంట్ కట్ చేశారు. బోట్‌ క్లబ్‌లోని సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ నివాసంతో పాటు చీఫ్‌ ఇంజినీర్‌ , ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఇళ్లకు కూడా ఆయన కరెంట్‌ కట్‌ చేశారు. దీంతో ముందస్తు చర్యలు లేకుండా కరెంటు లైన్లను కత్తిరించారని, ఇది పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందంటూ విద్యుత్ శాఖ అధికారులు ఎమ్మెల్యే వీరేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే

Published on: Dec 28, 2025 04:26 PM