డెలివరీ బాయ్‌గా మారిన ఎమ్మెల్యే.. ‘ఏ పనీ తక్కువ కాదన్న నేత’

Updated on: Jan 23, 2026 | 12:51 PM

పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ డెలివరీ బాయ్‌గా మారి ప్రజలకు షాకిచ్చారు. డెలివరీ సిబ్బంది కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు ఈ వినూత్న ప్రయత్నం చేశారు. ఎండ, వాన, ట్రాఫిక్‌లో వారి శ్రమను ప్రత్యక్షంగా అనుభవించారు. డెలివరీ ఉద్యోగులకు మెరుగైన భద్రత, సౌకర్యాలు అవసరమని గుర్తించారు. అంతేకాక, దివ్యాంగుల జీవనోపాధికి ట్రై సైకిల్ అందించి, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

టిడిపి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చేసిన ఓ వినూత్న ప్రయత్నం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన డెలివరీ బాయ్ గా మారి స్వయంగా ఇంటింటికి ఆర్డర్లను అందించారు. సాధారణ ప్రజల మాదిరిగానే యాప్ ద్వారా వచ్చిన ఫుడ్ ఆర్డర్స్ , ఇతర వస్తువులను తీసుకొని పలు ఇళ్లకు వెళ్లి డెలివరీ చేశారు. ఫుడ్‌ డెలివరీ బోయ్‌గా వచ్చిన ఎమ్మెల్యేను చూసి ఫుడ్‌ ఆర్డర్‌ చేసినవాళ్లు షాకయ్యారు. డెలివరీ సిబ్బంది రోజూ ఎదుర్కొనే ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రయోగం చేస్తున్నట్లు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తెలిపారు. తద్వారా.. ఎండ , వాన , ట్రాఫిక్, టైమ్‌ టెన్షన్‌ వంటి పరిస్థితుల్లోనూ పనిచేసే డెలివరీ బాయ్స్ కష్టాలు తమకు స్పష్టంగా అర్థం అయ్యాయని చెప్పారు. వారి సేవలను సమాజం గౌరవించాలని ఆయన కోరారు. కొద్దిరోజులుగా కానూరు , పోరంకి , యనమలకుదురు ప్రాంతాల్లో డెలివరీ చేస్తూ కనిపించిన పెనమలూరు ఎమ్మెల్యేను చూసి ఆర్డర్లు తీసుకున్న ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డెలివరీ బోయ్‌గా పనిచేస్తున్నవారికి ద్వారా డెలివరీ సిబ్బందికి భద్రతపరంగా మెరుగైన సౌకర్యాలు అవసరమన్న విషయాన్ని గుర్తించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మరోవైపు తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో కానూరుకు చెందిన సాయని బసవేశ్వర రావు కు క్యాటరింగ్ తో నడిచే ట్రై సైకిలు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అందించారు. శారీరక అంగవైకల్యం , అనారోగ్య కారణాలతో జీవనోపాధి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసాని ఇచ్చారు. అంగవైకల్యం శాతాన్ని బట్టి నెలకు 6000 నుంచి 15వేల రూపాయలు వరకు పింఛన్ అందజేస్తూ ఆర్థిక భరోసా ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బుర్ఖా ధరించి చైన్ స్నాచింగ్.. కట్ చేస్తే..

‘డిజిటల్ లంచం’.. ఇప్పుడు షాకింగ్ ట్రెండ్‌

పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి.. అలా ఎలా మావా

అసలు మీరు ఐఏఎస్ కు ఎలా సెలక్టయ్యారు ?? విద్యార్థి ప్రశ్నకు.. కలెక్టర్ జవాబిది!

సముద్రపు లోతుల్లోకి “ISRO’ ప్రయాణం