తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు

Updated on: Jun 26, 2026 | 8:20 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు సృష్టిస్తోంది. నైజీరియాకు చెందిన మెర్సీ, గుడ్ నెస్ అనే తలలు అతుక్కుని పుట్టిన కవలలను ఏఐ సాయంతో యూఏఈ వైద్యులు విజయవంతంగా వేరు చేశారు. 19 నెలల వయసులో జరిగిన ఈ సంక్లిష్ట శస్త్రచికిత్స అనంతరం ఏడాది పాటు కోలుకొని చిన్నారులు తమ కుటుంబంతో తిరిగి కలిశారు. ఇది వైద్య రంగంలో ఒక మహత్తర విజయంగా నిలిచింది.

ఆధునిక వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అద్భుతాలు సృష్టిస్తోంది. డాక్టర్లకు సైతం అసాధ్యం అనిపించిన ఒక సంక్లిష్టమైన శస్త్రచికిత్సను ఏఐ సహాయంతో విజయవంతంగా పూర్తి చేసి, ఇద్దరు చిన్నారులకు పునర్జన్మ ప్రసాదించారు. తలలు అతుక్కుని పుట్టిన నైజీరియాకు చెందిన కవలలు మెర్సీ, గుడ్ నెస్ లను వేరు చేసిన ఈ వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెర్సీ, గుడ్ నెస్ ఇద్దరూ అతుక్కుపోయిన పుర్రెలు, కలిసిపోయిన మెదడు, రక్తనాళాలతో జన్మించారు. ఇలాంటి కవలలు పుట్టడం చాలా అరుదు. గణాంకాల ప్రకారం, ప్రతి 25 లక్షల డెలివరీలలో ఒకరికి మాత్రమే ఇలాంటి సమస్య వస్తుంది. తల పైభాగంలో అతుక్కుని పుట్టే కవలలు కేవలం ఐదు శాతం మంది మాత్రమే. ఇలాంటి సందర్భాలలో 40 శాతం మంది కాన్పుకు ముందే లేదా డెలివరీ సమయంలో మరణిస్తారని, మరో మూడో వంతు మంది పుట్టిన 24 గంటలలోపే చనిపోతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ గణాంకాలను బట్టి మెర్సీ, గుడ్ నెస్ ప్రాణాలతో నిలవడం, ఆపై విజయవంతంగా వేరుపడటం ఒక గొప్ప అద్భుతమనే చెప్పాలి. మెర్సీ, గుడ్ నెస్ కు ఆరు నెలల వయసు ఉన్నప్పుడు, వారికి చికిత్స అందించేందుకు యూకే స్వచ్ఛంద సంస్థ జెమినీకి డాక్టర్లు సిఫారసు చేశారు. 2020లో, 19 నెలల వయసులో ఉన్నప్పుడు, వారి తల్లిదండ్రులు సర్జరీ కోసం వారిని నైజీరియా నుండి యూఏఈలోని అబుదాబికి తీసుకెళ్లారు. అబుదాబిలోని ప్రఖ్యాత ఖలీఫా మెడికల్ సిటీలో ఈ సంక్లిష్ట శస్త్రచికిత్స నిర్వహించబడింది

మరిన్ని వీడియోల కోసం :

Published on: Jun 26, 2026 08:17 PM
Loading...
Unable to load recommendations.
Follow Us