Viral Video: ఉత్తరప్రదేశ్‌లో వింత ఘటన.. తాను చనిపోయానంటూ 200 మందిని.. మహిళ ఫిర్యాదుతో సీన్‌ రివర్స్‌

Updated on: Apr 24, 2022 | 8:45 AM

మాట్రిమోనీ సైట్​ పేరుతో 200 మందికిపైగా యువతులకు టోకరా పెట్టాడు ఓ కేటుగాడు. కరోనా లాక్‌డౌన్‌ టైమ్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఓ వెబ్​సైట్​ను ప్రారంభించాడు . మంచి సంబంధాలు కుదుర్చుతానంటూ అనేకమంది యువతులకు వల వేశాడు.


మాట్రిమోనీ సైట్​ పేరుతో 200 మందికిపైగా యువతులకు టోకరా పెట్టాడు ఓ కేటుగాడు. కరోనా లాక్‌డౌన్‌ టైమ్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఓ వెబ్​సైట్​ను ప్రారంభించాడు . మంచి సంబంధాలు కుదుర్చుతానంటూ అనేకమంది యువతులకు వల వేశాడు. అసలు కథ ఇప్పుడే మెుదలైంది.. వివాహం చేసుకోవాలనుకునే వారికి జాతక దోషాలు ఉన్నాయని, అవి సరిచేసేందుకు పూజలు చేయిస్తానని నమ్మబలికి వారి నుంచి భారీగా డబ్బు వసూలు చేసేవాడు. డబ్బులు తన ఖాతాలో పడగానే ఇంక వారి కాల్స్ కు స్పందించేవాడు కాదు. డబ్బులు ఇచ్చిన బాధితులు ఒత్తిడి చేస్తే వారి నుంచి తప్పించుకునేందుకు తాను చనిపోయినట్లు నాటకం ఆడేవాడు. సోషల్​ మీడియా, వెబ్​సైట్లలో తన ప్రొఫైల్​ ఫొటోను మార్చేసేవాడు. చనిపోయాడని నమ్మించడానికి దండ వేసి ఉన్న ఫొటోను పెట్టేవాడు. దీంతో చాలా మంది యువతులు అది నిజమేననుకుని నిందితుడిని వదిలేశారు. అయితే ఇటీవల ఉత్తర్​ప్రదేశ్​లోని బస్తీ జిల్లాకు చెందిన ఓ యువతి చేసిన ఫిర్యాదుతో సీన్ రివర్స్ అయింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. నిందితుడిని గజియాబాద్​కు చెందిన తరుణ్​ కుమార్​గా గుర్తించారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్‌ అవుతున్న చింపు..

Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!

Published on: Apr 24, 2022 08:45 AM
Loading...
Unable to load recommendations.
Follow Us