రీల్స్ కోసం ఇదేం పిచ్చిరా సామీ.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లోనే !!
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రతీ ఒక్కరికీ రీల్స్ పిచ్చి పెరిగిపోయింది. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని ప్రాణాలకు సైతం తెగించి రీల్స్ చేస్తున్నారు. లైక్స్ కోసం లైఫ్‌ని రిస్క్‌లో పడేసుకుంటున్నారు. అలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ యువకుడు రోడ్డుమీద ఉండే సైన్ బోర్డు పైకి ఎక్కి పులప్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రతీ ఒక్కరికీ రీల్స్ పిచ్చి పెరిగిపోయింది. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని ప్రాణాలకు సైతం తెగించి రీల్స్ చేస్తున్నారు. లైక్స్ కోసం లైఫ్‌ని రిస్క్‌లో పడేసుకుంటున్నారు. అలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ యువకుడు రోడ్డుమీద ఉండే సైన్ బోర్డు పైకి ఎక్కి పులప్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అమేదీ లోని జాతీయ రహదారిపై ఓ యువకుడు రోడ్డుపై ఉండే సైన్‌బోర్డు పైకి ఎక్కి పులప్స్ చేశాడు. నేల నుంచి 10 మీటర్లకు పైగా ఎత్తులో వేలాడుతూ స్టంట్లు చేశాడు. మరో యువకుడు కూడా పైకి ఎక్కి అతడి వీడియో తీశాడు. ఏ మాత్రం పట్టు జారినా ప్రాణాలు ప్రమాదంలో పడేవి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు. ప్రాణాలు చాలా విలువైనవి. రీల్స్ కోసం ఇలా తెగించడం సరికాదు అని ఒకరు.. ‘‘రీల్స్ కోసం ప్రమాదకర స్టంట్లు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూసినా.. కొందరిలో మాత్రం మార్పు రావడం లేదని మరొకరు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా
కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి
గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు