బండిని రివర్స్ చేశాడు.. సీన్ కాస్తా రివర్స్ అయింది.. వీడియో

|

Mar 03, 2022 | 9:54 AM

జీవితంలో ఊహించని ప్రమాదాలు ఎన్నో జరుగుతుంటాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి జరగాల్సింది జరగకమానదు. తరచూ అలాంటి వీడియోలు నెట్టింట్లో ప్రత్యక్షమవుతుంటాయి.

జీవితంలో ఊహించని ప్రమాదాలు ఎన్నో జరుగుతుంటాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి జరగాల్సింది జరగకమానదు. తరచూ అలాంటి వీడియోలు నెట్టింట్లో ప్రత్యక్షమవుతుంటాయి. క్షణాల్లో బ్రతుకు జీవుడా అనుకేలా పలు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి షాప్ ఎదుట పార్క్ చేసి ఉన్న తన ట్రాలీ ఆటోను రివర్స్ చేస్తున్నాడు. అతడు రివర్స్ చేశాడో.. లేదో మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఇతను ఆటో ట్రాలీ రివర్స్‌ చేస్తున్న ప్రదేశంలో ఒక మురికి కాలువ సిమెంట్‌ పలకలతో మూసి ఉంది. ఇతను రివర్స్‌ చేసిన ఆటో ట్రాలీ ఆ సిమెంట్‌ పలకలమీదుగా వెళ్లింది… అంతే ఆ సిమెంట్‌ పలకలు విరిగిపోయి.. ఆ ట్రాలీ మురికి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు అతడికేం గాయాలు కాలేదు.

 

Also Watch:

మీరు చేసే ఈ తప్పులే తలనొప్పికి కారణం.. అవేంటో తెలుసా ?? వీడియో

ఛీ..ఛీ.. ఇదేం ఫుడ్‌రా బాబు !! తేలు, పాముల సూప్‌.. వీడియో

అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు.. కానీ వరుడు చేసిన పనేంటో తెలుసా ?? వీడియో

Viral Video: మహిళపై షార్క్‌ ఎటాక్‌ !! పోరాడి.. పోరాడి.. !! వీడియో

టామ్‌ అండ్‌ జెర్రీలో పుష్ప సన్నివేశాలు. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. వీడియో