వీడు మామూలోడు కాదు.. పామునే ఫుట్ బాల్‌ ఆడుకున్నాడుగా!

Updated on: Jun 23, 2026 | 8:53 PM

వియత్నాంలో ఓ వ్యక్తి భారీ కింగ్ కోబ్రాతో ఎదురెదురుగా తలపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాటేయడానికి దూసుకొచ్చిన పామును అతడు భయపడకుండా కాలితో పలుమార్లు తన్నడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ప్రమాదకర సంఘటనపై నెటిజన్లు షాక్ అవుతుండగా, ఇలాంటి ప్రాణాంతక స్టంట్లకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా పాము పేరు చెబితేనే కొందరు గజగజా వణుకుతారు. అలాంటిది పడగవిప్పి బుసలు కొడుతున్న భారీ కింగ్ కోబ్రాతో ఓ వ్యక్తి ఏకంగా ఫుట్‌బాల్ ఆడుకున్నంత పనిచేశాడు. ఒళ్ళు గగుర్పొడిచే ఈ వింత సంఘటన వియత్నాంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వైరల్ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి పొలం గట్టుపై నిలబడి ఉండగా, అంతలో పొలం గట్టు కింద నుంచి ఓ భారీ పాము ఒక్కసారిగా పైకి లేచింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవాల్సిన ఆ వ్యక్తి, ఏమాత్రం బెదరకపోగా.. పాము కాటేయడానికి ముందుకు రాగానే తన కాలితో దాన్ని బలంగా తన్నాడు. ఆ దెబ్బకు పాము దూరంగా పడినా, ‘తగ్గేదే లేదంటూ’ మరింత కోపంతో మళ్లీ అతని పైకి దూసుకొచ్చింది. కానీ, ఆ వ్యక్తి సెకన్ల వ్యవధిలో దాన్ని గాల్లోనే రెండోసారి కూడా కాలితో తన్నాడు. మరింత రెచ్చిపోయిన పాము కోపంతో అతనిపై భయంకరంగా విరుచుకుపడింది. అతడు కూడా ఏమాత్రం తగ్గేదే లేదన్నట్టు పామును ఫుట్‌బాల్‌లా తన్నుతూనే ఉన్నాడు. పాము రివర్స్‌ ఎటాక్ చేస్తూనే ఉంది. ఈ దృశ్యం చూస్తే గుండె ఆగినంత పనవుతుంది. ఈ భయంకరమైన ఫైటింగ్‌ను కొందరు కెమెరాలో బంధించి నెట్‌లో పెట్టడంతో అది విపరీతంగా వైరల్‌ అవుతూ ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోంది. “ఇతను మనిషా.. యముడా?” పాముతో ఆటలేంటి బాస్‌ అని నెటిజన్లు షాకవుతుంగా.. “చిన్న తప్పు జరిగినా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి, ఇలాంటి ప్రాణాంతక స్టంట్స్ చేయకండి” అంటూ మరికొందరు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్వామీ.. మా అత్త చనిపోయేలా చూడు.. రూ.20 నోటుతో దేవుడికి ‘సుపారీ’

అమెరికాలో గడ్డి కోస్తూ లక్షల్లో సంపాదన.. నెటిజన్ల రియాక్షన్‌ ఇదే!

నాలుగు షాపుల్లో చొరబడిన దొంగలు.. పాపం చివరికి దొరికింది ఇదే!

టీఆర్ ఫైలింగ్‌లో ‘క్లాడ్ ఏఐ’ హవా.. సీఏను మించిన అద్భుతమైన పని తీరు!

క్లాస్ 12 తర్వాత చదువు ఆపేయండి! సంచలనంగా వ్యాపారవేత్త కామెంట్

Follow Us