విమానం డోర్‌ ఓపెన్‌చేసి దూకేసిన ప్రయాణికుడు

Updated on: Jan 13, 2024 | 8:56 PM

తరచూ విమానాల్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఓ పదహారేళ్ల కుర్రాడు విమానంలో ప్రయాణిస్తుండగా చిత్రవిచిత్రంగా ప్రవర్తించాడు. తన కుటుంబ సభ్యులపైనే దాడికి పాల్పడ్డాడు. తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు విమానం టేకాఫ్‌కు సిద్ధంగా విమానం డోర్‌ ఓపెన్‌ చేసి అందులోంచి దూకేశాడు. ఈ ఘటన ఎయిర్‌ కెనడా విమానంలో చోటుచేసుకుంది. జనవరి 8న దుబాయ్‌కు వెళ్లాల్సిన బోయింగ్‌ 747 విమానం టొరంటో నుంచి బయలుదేరేందుకు సిద్ధమైంది.

తరచూ విమానాల్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఓ పదహారేళ్ల కుర్రాడు విమానంలో ప్రయాణిస్తుండగా చిత్రవిచిత్రంగా ప్రవర్తించాడు. తన కుటుంబ సభ్యులపైనే దాడికి పాల్పడ్డాడు. తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు విమానం టేకాఫ్‌కు సిద్ధంగా విమానం డోర్‌ ఓపెన్‌ చేసి అందులోంచి దూకేశాడు. ఈ ఘటన ఎయిర్‌ కెనడా విమానంలో చోటుచేసుకుంది. జనవరి 8న దుబాయ్‌కు వెళ్లాల్సిన బోయింగ్‌ 747 విమానం టొరంటో నుంచి బయలుదేరేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో ఓ ప్రయాణికుడు హఠాత్తుగా క్యాబిన్‌ తలుపు తెరిచాడు. సిబ్బంది అతడిని అడ్డుకునే లోపే కిందకు దూకేశాడు. ఈ హఠాత్‌పరిణామానికి తోటి ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. 20 అడుగుల ఎత్తు నుంచి అతడు దూకడంతో తీవ్రంగా గాయపడినట్లు ఎయిర్‌ కెనడా తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. సిబ్బంది అతడిని తక్షణమే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి ఎలా ఉందో పేర్కొనలేదు. అతడు ఎందుకు అలా ప్రవర్తించాడో తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విమానం ఆరు గంటలు ఆలస్యంగా దుబాయ్‌కు బయలుదేరింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆలయంలో వివాహబంధం ద్వారా ఒక్కటైన యువతులు

జ్యోతిర్లింగ దర్శన యాత్ర చేయాలనుకుంటున్నారా.. ఇది మీకోసమే..

క్షుద్రపూజలకు ఏర్పాట్లు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు

ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్‌‌‌‌ ఆఫర్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే ??

సంక్రాంతికి ఊరెళ్తున్నారా ?? దొంగలు దోచేస్తారు జాగ్రత్త !!

Loading...
Unable to load recommendations.
Follow Us